ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని సక్సెస్ సాధించగా మరికొన్ని పరాజయం పాలయ్యాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో తన ఆకట్టుకునే అందం, పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల మదిని గెలుచుకున్న బెస్ట్ హీరోయిన్ ఎవరు అనే దాని పై స్పష్టత వచ్చేసింది. మెజారిటీ విశ్లేషకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల నుండి అభినందనలు గెలుచుకున్న నటి సమంత, ఈ ఏడాది బెస్ట్ హీరోయిన్ గా అందరి మన్ననలు అందుకుంటున్నారు. రెండేళ్ల క్రితం యువ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి కోడలైన సమంత, ఈ ఏడాది భర్తతో కలిసి మజిలీ అనే సినిమాలో నటించారు. 

 

శివ నిర్వాణ దర్శకత్వంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య ప్రేమానుబందాల గురించి తెలుపుతూ, హృద్యమైన కథగా తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నటిగా సమంతకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాలో భర్త యొక్క ప్రేమను పొందలేక లోలోపల ఎంతో మధనపడుతూ, చివరికి అతడిని మనసును తన ప్రేమతో గెలుచుకున్న భార్యగా నటించి మంచి పేరు దక్కించుకుంది. ఆ తరువాత ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఓ బేబీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కొరియన్ సినిమా గ్రానీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యువతిగా, వృద్ధురాలిగా రెండు రకాల విభిన్న పాత్రల్లో నటించిన సమంత, ఆయా పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారు అనే చెప్పాలి. 

 

ఇక రిలీజ్ తరువాత మంచి విజయాన్ని అందుకున్న ఆ సినిమా, నటిగా సమంతను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. సో, ఈ విధంగా ఈ ఏడాది రెండు రకాల విభిన్న చిత్రాల్లో తన ఆకట్టుకునే అందం, నటనతో అందరిని అలరించిన అక్కినేని సమంత ఈ ఏడాది బెస్ట్ హీరోయిన్ అని అనడంలో ఏ మాత్రం సందేహారం అవసరం లేదని, అయితే ఒకరిద్దరు హీరోయిన్లు సమంతకు పోటీ ఇచ్చినప్పటికీ కూడా, మంచి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన సమంతానే టాప్ స్థానంలో నిలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: