టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు నటిస్తున్న తాజా సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు సంక్రాంతి కానుకగా ఒక్క రోజు తేడాలో సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాల పై టాలీవుడ్ ప్రేక్షకులు మరియు ఆయా హీరోల ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్,అనిల్ రావిపూడి ల తొలి కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాను మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తుండగా, 

 

మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన కమర్షియల్ మూవీ గా తెరకెక్కతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే నాలుగు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ సినిమా అలవైకుంఠపురములో నుండి కూడా నాలుగు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సంపాదించాయి. టీజర్ పరంగా సరిలేరు ఒకింత మంచి రెస్పాన్స్ సంపాదించగా, సాంగ్స్ పరంగా అలవైకుంఠపురములో బాగా దూసుకెళ్తోంది. ఇప్పటికే అలవైకుంఠపురములో ‘రాములో రాముల’ సాంగ్ 75 నిమిషాల్లో క్రియేట్ చేసిన 100కె లైక్స్ రికార్డ్ ని, 

 

సరిలేరు నీకెవ్వరు ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే ఫ్యామిలీ సాంగ్ కేవలం 69 నిమిషాల్లోనే బ్రేక్ చేసి రికార్డ్ సాధించింది. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు తన సత్తా చాటి మొన్న రిలీజ్ అయిన ‘డాంగ్ డాంగ్’ ప్రోమో సాంగ్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. రిలీజైన 24 గంటల్లో ఈ ప్రోమో సాంగ్ 182కె లైక్స్ సాధించి ఇప్పటి వరకూ టాప్ లో ఉన్న ‘రాములో రాముల’ ప్రోమో సాంగ్ సాధించిన 164కె లైక్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఈ విధంగా ఒకసారి మహేష్ పై బన్నీ, ఆ తరువాత బన్నీ పై మహేష్, ఇలా ఒకరిని మించేలా మరొకరు పైచేయి సాధిస్తూ సంక్రాంతి రిలీజ్ సమయానికి రెండు సినిమాల మధ్య మరింతగా పోటీని పెంచేస్తున్నారు. మరి రేపు రిలీజ్ తరువాత ఈ రెండు సినిమాల్లో ఏది ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: