రామ్‌ గోపాల్‌వర్మ అంటే నచ్చే వాళ్లు కొందరైతే, నచ్చని వారు మరి కొందరు. కొంతమంది అతను ఎవరికి అర్ధం కాని పిచ్చోడంటారు. మరి కొందరు అతనో మహా జ్ఞాని అంటారు. ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్ అంటూ రామూ తన పని తాను చేసుకుంటూ వెళ్లుతాడు. ఇక సినీ ప్రపంచంలో రామ్‌ గోపాల్‌వర్మది ఒక ప్రత్యేకమైన శైలి. సినిమా టైటిల్ దగ్గరి నుండి, సినిమా పూర్తి చేసేవరకు. ఆయన ఎంచుకున్న కధల విషయంలో కూడా ఎక్కడా తలవంచని వివాదస్పద వ్యక్తి. ఇప్పటికి ఆయనపై నమోదైన కేసులను చూసి అర్ధం చేసుకోవచ్చూ.

 

 

ముక్కుసూటిగా వెళ్లుతూ, ముచ్చెమటలు పట్టిస్తూఉండే వర్మని కొందరు ఇతనికేమైనా పిచ్చా అంటూ హేళన చేసిన, వ్యంగంగా మాట్లాడినా తన వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టని తలతిక్క మనిషి వర్మ అని అనుకుంటారట అంతా.. ఇకపోతే ఈ సంచలనాల వర్మ మరో సంచలనానికి తెరతీసాడు. అదేమంటే ఇటీవల ‘బ్యూటిఫుల్‌’ చిత్ర ప్రీరిలీజ్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్‌ నైనాతో స్టెప్పులేసిన ఆయన తాజాగా ఆమె కాళ్లు పట్టుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.

 

 

అగస్త్య మంజు దర్శకత్వంలో, రామ్‌గోపాల్‌ వర్మ కథను సమకూర్చగా నైనా గంగూలీ, సూరి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్’ ఈ సినిమాను ‘ట్రిబ్యూట్‌ టు రంగీలా’ అనే ఉపశీర్షికతో విడుదలకు సిద్ధం చేశారు. ఇకపోతే జనవరి 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సాయంత్రం ‘ప్రీ న్యూ ఇయర్‌’ ప్రైవేటు పార్టీని హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ పార్టీకి అభిమానులు, సినీ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.

 

 

అయితే ఇందులో భాగంగా ఆర్జీవీ ‘బ్యూటిఫుల్‌’ సినిమా నుంచి ‘రా కసితీరా’ అనే పాటకు హీరోయిన్‌ నైనాతో కలిసి  డ్యాన్స్‌ చేస్తూ అందులో భాగంగా హీరోయిన్‌ నైనా కాళ్లపై పడ్డారు. అంతలోనే ఆర్జీవీ చేసిన పనికి షాక్‌ అయినా నైనా ఒక్కసారిగా కింద కూర్చోని భావోద్వేగంతో ఆర్జీవీని పట్టుకుని కంట నీరు పెట్టుకున్నారు.. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: