2019 సంవత్సరంలో టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు రెండు మాత్రమే. ఆ సినిమాలే సాహో,  సైరా. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేక బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. వసూళ్ళ పరంగా ఈ సినిమా సత్తా చాటినప్పటికీ టాక్  పరంగా మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో భారీ బడ్జెట్ తో నిర్మించినప్పటికీ సినిమా మాత్రం హిట్ కొట్టలేకపోయింది.మరో వైపు  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా పై  కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

 

 ఎందుకంటే చిరంజీవి 151వ సినిమా కావడం... చిరంజీవి కెరీర్ లోనే మొట్ట మొదటి  చారిత్రాత్మక సినిమా కావడం... భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా పై ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోయాయి. సినిమా విడుదలైన తర్వాత మాత్రం కొంత మంది ప్రేక్షకులను మాత్రమే సంతృప్తి పరచగలిగినది. చాలా మంది ప్రేక్షకులు సైరా నరసింహారెడ్డి సినిమా చూసి నిరాశకు గురయ్యారు. దీంతో భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినప్పటికీ సైరా నరసింహారెడ్డి సినిమా మాత్రం విజయం సాధించలేకపోయింది. ఈ  సినిమా టాక్ పరంగా నటన పరంగా చిరంజీవి కి మంచి పేరు తెచ్చి పెట్టినప్పటికీ  వసూళ్ళ పరంగా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది సైరా నరసింహారెడ్డి సినిమా. 

 

 ఇకపోతే ఈ ఏడాది పెండింగ్లో ఉన్న టాప్ టెన్ సినిమా జాబితాలను గూగుల్ ఇండియా విడుదల చేసింది. సినిమాలో ఒక్క సౌత్ సినిమాకు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. సినిమాలో మొత్తం ఏడు బాలీవుడ్ 3 హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా సాహో లాంటి సినిమాలు కూడా టాప్ 10లో ఉన్న సినిమాల్లో  చోటు సంపాదించుకోలేక పోయాయి. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత అవెంజర్స్ ది ఎండ్ గేమ్,  రెండవ స్థానంలో నిలువగా.. మూడో స్థానంలో జోకర్, 4వ  స్థానంలో కెప్టెన్  మార్వెల్, ఆ తర్వాత  సూపర్ 30, మిషన్ మంగళ్,  గల్లీ బాయ్, హౌస్ఫుల్ 4 సినిమాలు టాప్ టెన్ ప్లేస్ లో  నిలిచాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: