2020 ఎంటర్ అవుతున్న సందర్భంలో 2010 నుండి 2019 వరకు టాప్ హీరోలలో ‘స్టార్ ఆఫ్ ది డికేట్’ ఎవరు అన్నచర్చ ఇప్పుడు టాప్ హీరో అభిమానులు మధ్య జరుగుతోంది. వాస్తవానికి ఆశక్తిదాయకంగా ప్రారంభం అయిన ఈచర్య అనేక మలుపులు తీసుకుని ఇప్పుడు టాప్ హీరోల అభిమానుల మధ్యచిచ్చు రేపడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి టాప్ హీరోల లిస్టులో చిరంజీవి పవన్ కళ్యాణ్ లు అగ్రస్థానంలో ఉన్నా వారి అభిమానులు మాత్రం ఈచర్చల పై ఆశక్తికనపరచడం లేదు. దీనితో టాప్ యంగ్ హీరోలుగా నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్న మహేష్ జూనియర్ అల్లు అర్జున్ చరణ్ ప్రభాస్ ల అభిమానుల మధ్య ఈ ‘చేస్తూ విధంగా నెగిటివ్ కామెంట్స్   చేసే విధంగా పరిస్థితులు మారిపోతున్నాయి.

ఈవార్ లో మహేష్ అభిమానులు చాలచురుకుగా పాల్గొంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ మాత్రమే అనీ సినిమాల హిట్స్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా 2010 – 2019 మధ్య మహేష్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది అంటూ వాదిస్తున్నారు. దీనితో రంగంలోకి దిగిన జూనియర్ అభిమానులు తారక్ నటించిన ‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ ‘జనతా గ్యారేజ్’ ‘జై లవ కుశ’ ‘అరవింద సమేత’ సినిమాలతో వరసగా ఐదు విజయాలు ముగిసి పోతున్న ఈదశాబ్దంలో రావడంతో స్టార్ ఆఫ్ ది డికేడ్ గా పిలవదగ్గ అర్హత ఒక్క జూనియర్ కు మాత్రమే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న పరిణామాలను పసిగట్టిన ప్రభాస్ అభిమానులు మరింత రెచ్చిపోతు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ప్రభాస్ ‘బాహుబలి’ ముందు ఏ హీరో ‘స్టార్ ఆఫ్ ది డికేడ్’ గా సరిపోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వార్ లో రామ్ చరణ్ అభిమానులు రంగప్రవేశం చేసి ‘రంగస్థలం’ లో చిట్టిబాబు లాంటి పాత్రను పోషించగల సామర్ధ్యం ఒక్క చరణ్ కు మాత్రమే సొంతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈవిషయంలో అల్లు అర్జున్ అభిమానులు కూడ ఎంటర్ అవ్వడంతో ఇప్పుడు ‘స్టార్ ఆఫ్ ది డికేట్’ వ్యవహారం వికటించి సంక్రాంతికి రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురము’ మూవీల విషయంలో మిగతా టాప్ హీరోల అభిమానుల నెగిటివ్ ప్రచారానికి గురయ్యే ఆస్కారం ఉంది అంటూ ఈమూవీలను కొనుక్కున్న బయ్యర్లు భయపడిపోతున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: