రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  ఇద్దరు బడా మాస్ హీరోలతో.. అదీ చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ ఏ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయాలనే దానిపై ఇప్పటికీ మిస్టరీలా ఉంది.

 

ముఖ్యంగా ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్‌తో చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. మ‌రోవైపు ‘జనతా గ్యారేజ్’ సినిమా టైమ్‌లోనే మైత్రీ మూవీ మేకర్స్ తారక్‌తో మరో సినిమాకు కమిట్‌మెంట్ తీసుకుంది. కాకపోతే దీనికీ టైమ్ లిమిట్ అంటూ ఏది లేదు. అయితే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌కు ఒక సినిమా చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు. 

 

ఈ నేప‌థ్యంలో  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు అట్లీతో పాటు.. కొరటాల శివకు ఓకే చెప్పాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ వీళ్లును కాదని ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొత్త దర్శకుడితో ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కే.యల్.నారాయణ నిర్మించే అవకాశాలున్నాయి.

 

వాస్త‌వానికి ఇప్పటి వరకు ఎన్టీఆర్ తన కెరీర్‌లో రాజమౌళి, వి.వి.వినాయక్, ముళ్లపూడి వర వంటి సీనియ‌ర్‌ దర్శకుల‌కే ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మెహర్ రమేష్‌కు తెలుగులో తొలి అవకాశమిచ్చాడు ఎన్టీఆర్. ఆ తర్వాత మరో కొత్త దర్శకుడు ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ అపజయం ఎగరకుండా వరస హిట్లతో జోష్ మీదున్నాడు. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో జాతీయ స్థాయిలో సత్తా చాటబోతున్నాడు. ఇలాంటి టైమ్ కొత్త డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇస్తే.. పెద్ద రిస్కే తీసుకున్న‌ట్టు అవుతుంది. మరి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ మ్యాచ్ అయ్యేలా ఆ కొత్త దర్శకుడు ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: