నేటి ప్రపంచంలో, సెలబ్రిటీలు వారి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడానికి బాడీగార్డ్ లను కలిగి ఉండటం..  ఇంకా తమ అభిమానులు, ప్రమాదకర వ్యక్తుల నుండి వారిని వాళ్లు రక్షించుకోవడం కోసం బాడీగార్డ్స్ తప్పనిసరి. అవార్డు ఫంక్షన్ల నుండి ఈవెంట్స్ వరకు, బాడీగార్డ్స్ తమ స్టార్లను ప్రతిచోటా అనుసరిస్తారు. అయితే, ఈ బడా సినిమా నటులను వారి ఫాన్స్ నుండి రక్షించడానికి చాలా డబ్బులు తీసుకుంటారు. ఎక్కువ పారితోషికాన్ని తీసుకునే టాప్ సెలబ్రిటీ బాడీగార్డుల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సల్మాన్ ఖాన్-

షేరా అనే పిలవబడే బాడీగార్డ్ బాలీవుడ్ నటులకు రక్షణ కల్పించే వారిలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బాడీగార్డ్. అతడు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వద్ద గత 15 ఏళ్ళకు పైగా పనిచేస్తున్నాడు. షేరా ని సల్మాన్ అతని కుటుంబ సభ్యుడిలా చూస్తాడు. అతని సంవత్సర జీతం అక్షరాలా రూ.2కోట్లు.

అమితాబ్ బచ్చన్

బాడీగార్డ్ జితేంద్ర షిండే చాలా కాలం అమితాబ్ బచ్చన్ కు కాపలాగా ఉన్నాడు. అతను అన్ని ఈవెంట్లకు, విధులకు అమితాబ్‌తో కలిసి ఉంటాడు. జితేంద్ర షిండే జీతం ఏడాది జీతం అక్షరాలా రూ. 1కోటి యాభై లక్షలు.

షారుఖ్ ఖాన్

బాడీగార్డ్ యాసీన్ ఒక దశాబ్దానికి పైగా SRK తో ఉన్నారు. అతని 6.3 అడుగుల ఎత్తు కారణంగా అందరూ అతని వైపు చూస్తూ ఉండేవారు. యాసీన్ సూపర్ స్టార్‌కు ఒక కుటుంబ సభ్యుడి లాంటి వాడు. షారుఖ్ ఖాన్ అతనికి వివాహ బహుమతిగా బాంద్రాలో లక్షల విలువైన ఒక ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చాడు.

తన మునుపటి బాడీగార్డ్ యాసీన్ ఖాన్ తన సొంత భద్రతా సంస్థను ప్రారంభించాలనుకున్నందున విడిపోవాలని నిర్ణయించుకున్న తరువాత రవి కింగ్..షారుఖ్ ఖాన్ కోసం వ్యక్తిగత బాడీగార్డ్ గాా  చేరాడు. అయితే, అతని సంవత్సరకాల జీతం రూ. 2కోట్ల 50లక్షలు.

అమీర్ ఖాన్


బాలీవుడ్ ఇండస్ట్రీ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్ తో కలిసి తిరుగుతున్నప్పుడు యువరాజ్ తనను తాను అదృష్టవంతుడిగా భవిస్తాడట. అయితే గతంలో అతను రోనిట్ రాయ్ కోసం రెండేళ్ళు పనిచేశాడు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ కి బాడీగార్డ్ గా ఉండి సంవత్సరానికి రూ. 2కోట్లు పుచ్చుకుంటున్నాడు.

దీపికా పదుకొనే

దీపికా పదుకొనే ఇప్పుడు సోషల్ మీడియాలో  ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న స్టార్లలో ఒకరు. ఈ ముద్దుగుమ్మ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వలనుకునే అభిమానులను లక్షలలోనే ఉన్నారు, కానీ ఆమె బాడీగార్డ్ 'జలాల్' ఒక సోదరుడిలాగే ఆమెను వారి నుండి రక్షిస్తాడు. అందువల్ల, ఆమె జలాల్ మణికట్టుపై రాఖీని చాలా సార్లు కట్టింది. జలాల్ ఏడాది జీతం రూ.80 లక్షలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: