రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ పెద్ద హీరోలతోనే చేసాడు. మధ్యలో సునీల్ తో ‘మర్యాదరామన్న’ మూవీ చేసినప్పటికీ అప్పటికే సీనియర్ ఆర్టిస్టుగా సునీల్ ఎంతో పేరు అనుభవాన్ని గణించాడు. దీనితో రాజమౌళి సినిమాలు అంటే కేవలం పెద్ద హీరోలతో తీసే భారీ సినిమాలు మాత్రమే అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి పరిస్థితులలో నిన్న జరిగిన ‘మత్తు వదలరా’ సక్సస్ మీట్ లో రాజమౌళికి ఒక అనుకోని ప్రశ్న ఎదురైంది. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న యాంకర్ రాజమౌళిని ఇరుకున పెట్టడానికి భవిష్యత్ లో కొత్త హీరోలతో సినిమాలు చేయరా అంటూ ఆమె రాజమౌళిని ప్రశ్నించింది. 

ఈ అనుకోని ప్రశ్నకు షాక్ అయిన రాజమౌళి చాల తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. కొత్త హీరోతో సినిమా చేయకూడదు అన్న నియమం తనకు లేదనీ అయితే ఒక కొత్త హీరోని పెట్టి ఆ హీరో చేత చాల ఓపికగా నటింపచేసి ఆ సినిమా హిట్ చేయాలి అంటే చాల ఓర్పు ఉండాలి అంటూ ప్రస్తుతం తనకు అంత ఓర్పు లేదు అంటూ జోక్ చేసాడు.

తన దృష్టిలో హీరోలను బట్టి సినిమాలు తీయనని అయితే తన కథకు సరిపడే టాప్ హీరోలను మాత్రం ఎంచుకుంటానని దీనివల్ల డబ్బు పేరు బాగా వస్తాయి అంటూ రాజమౌళి తన పై తానే సెటైర్ వేసుకున్నాడు. ఇదే సందర్భంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి మాట్లాడుతూ తనకు వయసు అయిపోయే లోపు తాను ఆ సినిమాను చేసి తీరతాను అని అయితే అది ఎప్పుడు అన్న విషయం తాను జోష్యం చెప్పలేను అంటూ కామెంట్ చేసాడు. దీనితో రాజమౌళి ఆలోచనలలో మహాభారతం ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న క్లారిటీ రావడంతో రాజమౌళి అభిమానులు ఆనంద పడుతున్నారు. దీనితో జక్కన్న ఖాతాలో మరో భారీ సినిమా రాబోతోంది అన్న విషయం క్లారిటీ వచ్చింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: