ఒక సాదాసీదా నటుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన టాలెంట్ ను  నిరూపించుకోని అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా మారిపోయారు  అమితాబచ్చన్. ఎన్నో సంచలన విజయాలు ఎన్నో అవార్డులు ఆయన సొంతం. ఇక తాజాగా సినీరంగంలో  దేశంలోనే అత్యున్నత అవార్డు  అయినా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. సినీ రంగంలోని అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అన్న విషయం తెలిసిందే. ఏకంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. కాగా అమితాబ్  బచ్చన్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం హర్షం  వ్యక్తం చేశారు. ఇకపోతే అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ తన భావోద్వేగాన్ని సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేశారు. 

 

 

 

 సినీ పరిశ్రమలోనే అత్యున్నతమైన అవార్డు అయిన  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తన తండ్రి సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని... ఈ అవార్డును సొంతం చేసుకున్న  నా తండ్రికి శుభాకాంక్షలు అంటూ అభిషేక్ బచ్చన్ తెలిపారు. మీరేనా స్ఫూర్తి... నా హీరో అంటూ భావోద్వేగమైన పోస్టు పెట్టారు అభిషేక్ బచ్చన్. మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది ఐ లవ్ యూ  డాడీ అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటో నే అభిషేక్ బచ్చన్ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధుర మైన జ్ఞాపకం ఇది అంటూ పేర్కొన్నారు. అభిషేక్ బచ్చన్ పోస్ట్  పై అభిమానులు అందరూ స్పందిస్తూ అమితాబ్ బచ్చన్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. మీ లాంటి నటుడు చిత్రపరిశ్రమలో ఉండడం మేము  చేసుకున్న అదృష్టం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

 

 

 

 ఇకపోతే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం గత సోమవారం జరిగింది. అయితే అమితాబచ్చన్ అనారోగ్యం కారణంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం కి హాజరు కాలేక పోతున్నట్లు నిర్వాహకులు చెప్పడంతో ఆదివారం ప్రత్యేకంగా ఈ అవార్డును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ అవార్డును  అమితాబ్ బచ్చన్ కు అందజేశారు. ఇకపోతే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమనటి గా  మహానటి చిత్రంలో నటించిన కీర్తి సురేష్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా అవార్డులను స్వీకరించారు. కాగా జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నట్లు టెక్నీషియన్లు కు  రాష్ట్ర భవన్ లో  నిన్న సాయంత్రం తేనీటి విందు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: