తీసింది మూడు, నాలుగు సినిమాలే. కానీ, యంగ్‌ హీరోలకు ఈ డైరెక్టర్‌ హాట్‌ ఫేవరెట్‌. పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 ఇలా తీసిన ప్రతి సినిమాలో తన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాను విజయతీరాలకు చేర్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడి. మొదటిసారిగా మల్టీ‍స్టారర్‌ సినిమాను తెరకెక్కించిన‌ అనిల్‌ పెద్ద హీరోలతో ఎక్క‌డా బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్ ని చాలా బాగా చూపించారు. తన మార్క్‌ కామెడీతోనే ప్ర‌తి  సినిమాను డిఫ‌రెంట్ స్టోరీస్‌తో తెరకెక్కిస్తున్నారు. దిల్‌ రాజు బ్యానర్‌ లో తెరకెక్కుతున్న మ‌రో సినిమాని కూడా అనిల్ తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. అదే ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించే స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం. 

 


మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ అనే చిత్రం తో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో సినిమా తాలూకా అనేక విశేషాలు బయటకొస్తూ అభిమానులలో ఆసక్తి పెంచుతున్నాయి.

 

తాజాగా ఈ మూవీ లో మహేష్ కు ఓ ఊతపదం ఉంటుందని తెలుస్తుంది. అనిల్ ఈ మధ్య తన సినిమాల్లో హీరోల చేత ఓ ఊతపదం పలికిస్తూ వస్తున్నాడు. రవితేజ తో ‘హు..హు..హూ..హూ..’ వెంకీ , వరుణ్ లతో ‘అంతేగా..అంతేగా’ అలాగే మెహ్రీన్‌తో హ‌నీ ఈజ్ ద బెస్ట్ లాంటి క్యాచీ ఊతపదాలు పలికించిన అనిల్..సరిలేరు లో మహేష్ చేత ‘నెవ్వర్ బిఫోర్…ఎవర్ ఆఫ్టర్’ అనే టైపులో ఓ ఊతపదం పలికించాడని సమాచారం. మరి ఈ ఊతపదం ఎంత పేలుతుందో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఊత‌ప‌దాల‌న్నీ మంచి హిట్ అయ్యాయి. ఎంత హిట్ అయ్యాయంటే `అంతేగా..అంతేగా` అనే డైలాగ్ వేరే సినిమాల్లో కూడా క్యామియోగా వాడేస్తున్నారు. ఇక టిక్‌టాక్‌లు, ఫేస్‌బుక్‌లు సోష‌ల్ మీడియా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: