ఎంమాయచేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన హీరోయిన్ సమంత.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమా లలో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన అందం అభినయంతో ఎన్నో సినిమాలలో చేసిన ఈ అమ్మడు ఎందరో స్టార్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో నటిస్తూ వస్తుంది. అలా అలుపెరగకుండా సినిమాలు చేస్తుంది.  

 

ఇకపోతే అక్కినేని కోడలు సమంత కు 2019 మర్చిపోలేని సంవత్సరం. కెరీర్ పరంగా ఒక అందమైన తీపి జ్ఞాపకం. ఒకే ఏడాదిలో రెండు బ్లాక్ బస్టర్లు అందుకుంది. ఓ బేబి చిత్రంతో సోలో నాయికగా బ్లాక్ బస్టర్ అందుకోవడమే గాక.. మజిలీ చిత్రంతోనూ మెమరబుల్ హిట్ అందుకుంది. ఈ ఏడాదికి గాను సామ్ చేసిన సినిమాలలో ఆమెకు ఇష్టమయిన సినిమా అంటే మజిలీ అని ఆమె చాలా సందాబాల్లో  చెప్పింది కూడా.. 

 

అందుకే 2019 సమంత నామ సంవత్సరం. తాజాగా ఓ ప్రముఖ చానెల్ వాళ్లు నవ నక్షత్ర పురస్కారం తో సమంత ను సన్మానించారు. ఈ వేదిక పై సామ్ ఓ ఆసక్తి కర వ్యాఖ్య ను చేసింది. లైఫ్ లో తాను సాధించింది చాలా తక్కువ అని తనని మించిన రియల్ హీరోలు ఎందరో ఉన్నారని సామ్ అంది. అంతేకాదు ఎవరైనా ఒక రియల్ హీరో జీవిత కథలో నటించాలని ఉందని సమంత వ్యాఖ్యానించడం సినీ ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

వివరాల్లోకి వెళితే .. రియల్ హీరో బయోపిక్ లో నటిస్తానని అంది కాబట్టి ఎవరైనా దర్శకుడు తన కోసం అలాంటి స్క్రిప్టు ను తెస్తారేమో చూడాలి. ప్రముఖ క్రీడాకారిణులు లేదా వివిధ రంగాల్లో గొప్ప గా రాణించిన తెలుగమ్మాయిలు ఎందరో. అలాగే బయటి ప్రపంచానికి తెలియని వీరాధి వీరుల కథలు తెలుగు గడ్డ పై ఎన్నో ఉన్నాయి.వాటిలోంచి ఏదైనా తీసుకొని  చేస్తుందేమో చూడాలి. ఇప్పటికైతే `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అటు పై హబ్బీ నాగ చైతన్య సరసన మరో చిత్రం లో నటించనుంది. ఆ సినిమాలు  ఏ విదంగా హిట్ ని ఇస్తాయో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: