వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమధ్య ఇలా అన్నారు కదా.. అంటే.. అవును అప్పుడు అలా అన్నాను.. ఇప్పుడు ఇలా అంటున్నాను అంటాడు. బ్యూటీఫుల్ సినిమా కోసం ఇచ్చిన ప్రీ న్యూఇయర్ పార్టీలో వర్మ చేసిన హడావిడి మనం చూశాం. ఈ హడావిడిలోనే పవన్ కల్యాణ్, శ్రీదేవిపై వర్మ ఓ మాట అనేశాడు. వర్మ ఏ మూడ్ లో అన్నాడోగానీ ఇప్పుడు ఆ మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 

 

నాకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. శ్రీదేవి కంటే నాకు పవన్ కల్యాణ్ అంటేనే ఎక్కువ ఇష్టం అన్నాడు. అయితే.. పవన్ అంటే ఇష్టం అన్న విషయాన్ని ఎన్నోసార్లు చెప్పినా.. శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఎక్కువ ఇష్టం అనే మాట హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజం కాకపోవచ్చనే అందరూ అనుకుంటారని కాబోలు.. నేనే దేవుడిని నమ్మననే విషయం మీకు తెలుసు. కానీ నాకు మా అమ్మంటే ఎక్కువ ఇష్టం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా.. శ్రీదేవి కంటే నాకు పవన్ అంటేనే ఎక్కువ ఇష్టం అన్నాడు. దీంతో వర్మ మాటలకు మరెవరూ కాదనలేకపోతున్నారు. సాక్షాత్తూ అమ్మ మీద ఒట్టేస్తే ఇది నిజమే అయి ఉంటుందని అంటున్నారు.

 

 

పవన్ కు తిక్క ఉంటే నాకు ఓ లెక్క ఉంది. అందరికీ పవన్ తిక్కే ఇష్టం కాబట్టి ఆయన సూపర్ స్టార్ అయ్యాడు అని కూడా అన్నాడు. వర్మ వ్యాఖ్యలు ఎవరికీ కొత్త కాకపోయినా ఇలా అమ్మ మీద ఒట్టు అంటేనే ఎటువంటి విమర్శలు రావడం లేదు. భవిష్యత్తులో ఈ మాట కూడా అప్పుడేదో అన్నాను.. అన్నట్టు మాట్లాడితే వర్మ క్యారెక్టర్ ఏంటో మరోసారి అర్ధం చేసుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: