2019 ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు వచ్చినా కానీ ఎక్కువగా సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకున్న వాళ్ళ పేర్లు గమనిస్తే ఎక్కువగా 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. ఈ ఏడాది సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది ఇట్లు యువతను బాగా ప్రభావితం చేసినట్లు తేలింది. ముందుగా కన్నడ నటుడు యశ్. 33 సంవత్సరాల వయసు కలిగిన యశ్.. కే జి ఎఫ్ సినిమా తో కర్ణాటక రాష్ట్ర ప్రజల లోనే కాక దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ మరియు అభిమానులను సంపాదించుకుని కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం 'కే జి ఎఫ్ 2' సినిమా  షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది.

 

ఇక క్రికెట్ రంగానికి వస్తే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచంలోనే అగ్రస్థానంలో టెస్ట్ మరియు వన్డే ర్యాంకింగ్స్ లో దూసుకుపోతూ ఎక్కువగా యువతను ప్రభావితం చేస్తున్న వ్యక్తి గా ఈ ఏడాది తేలాడు. అదే తరుణంలో బాలీవుడ్ యాక్టర్ అలియా భట్ కూడా 2019 బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ స్థానంలో మొదటి స్థానంలో దక్కించుకుని యువతను ప్రభావితం చేసే లిస్టులో చేరిపోయింది. క్రికెట్ రంగంలో అత్యుత్తమ బౌలర్ అని బూమ్రా పేరు సంపాదించి వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు.

 

ఇంకా కొన్ని రంగాలలో ఉన్న ఇంకా కొంతమంది పేర్లు ఈ ఏడాదిఅందరికంటే బాగా రాణించిన వాలుగా తోపుగాళ్ళు గా రాణించారు. మొత్తం మీద వచ్చిన లిస్టులో ఎక్కువగా దాదాపు 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు కావడం గమనార్హం. ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్న దేశం భారతదేశం కావడంతో చాలా రంగాలలో ఇప్పుడు మన దేశానికి చెందిన వాళ్ళు ప్రపంచంలోనే బాగా రాణించే వాలుగా అనేక విజయాలు సాధిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: