‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన జంట రష్మి గౌతమ్ - సుడిగాలి సుధీర్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులు లెక్కలేనంత మంది ఉన్నారు. అయితే ఆ అవకాశం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో రష్మీకి వచ్చింది. కానీ డేట్లు కుదరడంలేదు అన్న కారణంతో రష్మి సినిమాకు నో చెప్పిందట. అయితే అసలు విషయం ఇది కాదని తెలుస్తోంది.

 

ఇక్కడ నేను నిజాలే మాట్లాడాలని అనుకుంటున్నాను. సినిమాకు రెమ్యునరేషన్‌గా రష్మి రూ.40 లక్షలు కావాలని అడిగింది. కానీ సినిమా యూనిట్ కేవలం 35 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందుకు రష్మి ఒప్పుకోలేదు. ఇది రష్మి జీవితంలో దురష్టకరమైన సంఘటన. దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా రష్మి, సుధీర్ మధ్య మంచి ట్రాక్ నడుస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేదో పక్కనబెడితే వీరిద్దరినీ అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారు. జబర్దస్త్‌లో రష్మి, సుధీర్ కలిసి ఎన్నో పాటలకు డ్యాన్స్‌లు చేశారు. ఒకవేళ రష్మి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు ఒప్పుకుని ఉంటే.. వీరిద్దరూ జబర్దస్త్‌ షోలో వేసిన డ్యాన్సులను ఈ సినిమాలో కూడా వేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయి ఉండేది. అన్నారు ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు.

 

ఇప్పటివరకు రష్మి చేసిన సినిమాల్లో ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు? ఎందుకంటే రష్మిలోని గ్లామర్‌ను చూపించడానికి అందరూ ఆమెను వాడుకున్నారు కానీ తనలోని టాలెంట్ ని చూపేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. అప్పుడెప్పుడో డబ్బులు లేక ఇబ్బందిపడిందని పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాను రెమ్యునరేషన్ ఇవ్వనందుకు వదులుకుంది. దీని వల్ల రష్మి ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకవేళ ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాలో రష్మి హీరోయిన్‌గా చేసి ఉంటే మరో సినిమాలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తామనేవాళ్లేమో. రష్మికి, సుధీర్‌కి బాగా సింక్ అయింది. ప్రేక్షకులకు వారి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం’’.

 

ఆ రకంగా చూసుకుంటే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు రష్మి నో చెప్పి చాలా పెద్ద పొరపాటు చేసింది. నేను ఈ సినిమా చూశాను. హీరోయిన్ పాత్ర పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది. ఇందులో రష్మి నటించి ఉంటే.. రష్మికి ఇంతబాగా నటించడం వచ్చా అని ఆలోచించేవారు ఉంటారు. అంతేకానీ ‘గుంటూర్ టాకీస్’ లాంటి సినిమాలు ఎన్ని చేసినా ఏం లాభం? అది కాదు నటన అంటే. స్కిన్ షో చేస్తే పది మంది కుర్రాళ్లు చూసి ఆనందపడతారు కాబట్టి అందరూ చూడరు. మున్ముందు రష్మికి ఇలాంటి అవకాశాలు వస్తాయో రావో తెలీదు. స్కిన్ షో చేయడానికి, హీరోతో బుగ్గా బుగ్గా రాసుకోవడంలో కష్టమేముంది? అదే ఓ డైలాగ్ చెప్పి నలుగురి చేత శభాష్ అనిపించుకోవడంలో కదా ఉంది గొప్పతనమంతా. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: