మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలకు ఇప్పటివరకు మ్యూజిక్ అందించిన డైరెక్టర్ గా కీరవాణి గౌరవం దక్కించుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కీరవాణి మ్యూజిక్ అందించిన విషయం అందరికీ తెలిసినదే ఇటువంటి తరుణంలో తాజాగా 'మత్తువదలరా' సినిమాకి సంబంధించిన సక్సెస్ సంబరాలలో పాల్గొన్న కీరవాణి తన కొడుకు భైరవ కీరవాణి గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఒకానొక సమయంలో తన కెరియర్ చాల డౌన్ ఫాల్ లో ఉన్న సందర్భం లో తనపై ఎంతో మంది కుటుంబంలో ఆధారపడిన సందర్భంలో సింగపూర్ వెళ్లాలని ఒక విషయం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు కొడుకు భైరవ కీరవాణి మాట్లాడిన మాటలు గురించి  కంట్లో నీళ్లు వచ్చేటట్లు బావోద్వేగం గా మాట్లాడారు.

 

ఆ సందర్భంలో నా దగ్గర డబ్బులు లేని తరుణంలో తెలిసి తెలియని వయసు నాలుగేళ్ల నా కొడుకు భైరవ కీరవాణి నేను తీసుకెళ్తాను సింగపూర్ కి నిన్ను నేను తీసుకెళ్తాను అంటూ ఆ సమయంలో మాట్లాడటం జరిగింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఎవరి కాళ్లపై వారు నిలబడిన తరుణంలో భైరవ కీరవాణి కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న తరుణంలో ఇంట్లో బాధ్యతలు తెలియాలని నా కొడుకుకి కరెంటు బిల్లు కట్టాలని చెప్పడం జరిగింది. 

 

తాజాగా నాలుగేళ్ళ వయసులో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం భైరవ కెరియర్ గమనిస్తే అంటూ మాట ఇస్తే తప్పడు నా కొడుకు అన్నట్టుగా కీరవాణి గర్వంగా మాట్లాడారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ‘మత్తువదలరా’ సినిమా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కీరవాణి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న'RRR' ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: