అభిమానులు ఎవరిని అన్నా అభిమానిస్తే వాళ్ళ  కోసం ప్రాణాలు సైతం లెక్కచేయరు.. అభిమాని సినిమా వస్తుందంటే సినిమా హలో సందడి చేస్తారు.. ఆ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాసే దాక ఎదురు చూస్తారు.. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ "షారుఖ్‌ ఖాన్‌"కి చాలా ఫ్యాన్  ఫాలోయింగ్ ఉంది..

 

అయన కొంత కాలం నుంచి సినిమాలకు కొంత బ్రేక్‌ తీసుకున్నారు. గతేడాది విడుదలైన ‘జీరో’ సినిమా తర్వాత నుంచి ఇప్పటివరకూ ఆయన కొత్త చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు... ఏమి ప్రాజెక్ట్ కి కూడా ఓకే చెప్పలేదు.. దీనితో అభిమానుల్లో అలజడి మొదలయింది.. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో అభిమానులు పోస్ట్స్ పెట్టారు.

.

ఇపుడు అవి హాట్ టాపిక్ గా మారాయి..నేపథ్యంలో షారుఖ్‌ అభిమానులు ట్విటర్‌ వేదికగా కొత్త ఏడాదిలోనైనా కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయాలని షారుఖ్‌ను కోరుతున్నారు. దీంతో అభిమానులు ఒక టాగ్ క్రెయేట్ చేసారు... #WeWantAnnouncementSRK అనే ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

 

ఇందులో భాగంగా అభిమానులు వల్లా ఫీలింగ్స్ మెస్సేజ్ రూపంలో వ్యక్తం చెస్తున్నారు... ఓ అభిమాని.. ‘షారుఖ్‌ సర్‌ ఇప్పటివరకూ తీసుకున్న బ్రేక్‌ చాలు. ‘జీరో’ చిత్రం తర్వాత నుంచి నేను ఏ సినిమా చూడలేదు. ఎందుకంటే మీ నుంచి ఎలాంటి చిత్రాలు రాలేదు. కనీసం ప్రకటించలేదు కూడా. ఇప్పటికైనా మీ నుంచి గుడ్‌న్యూస్‌ వస్తుందని భావిస్తున్నాను.’ అని పేర్కొన్నారు. ఆ అభిమాని ఎవరో గాని గ్రేట్ కదా !!! వేరే ఈ సినిమా చూడలేదట ఇప్పటిదాకా...

 

మరో అభిమాని అయితే ఏకంగా ప్రాణం తీసుకుంటా అని పోస్ట్ పెట్టాడు.. కొత్త సంవత్సరంలో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. ‘షారుఖ్‌ సర్‌ మీరు కనుక జనవరి 1న కొత్త సినిమా గురించి ఎటువంటి ప్రకటన చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను.’ అని మెసేజ్ చేసాడు... షారుక్ ఇప్పటికన్నా స్పందించి తర్వాత సినిమా గూర్చి ప్రకటన ఇస్తే గాని అభిమానుల ఆత్రుత తీరదు.. కొత్త సంవత్సరం సరిగా ఎంజాయ్ కూడా చేయలేరు..






























మరింత సమాచారం తెలుసుకోండి: