రేణు దేశాయ్ ని ఎవరైనా పవన్ మాజీ భార్య అని పిలిస్తే ఆమె అంగీకరించదు. తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనీ తనను రేణు దేశాయ్ గా గుర్తించాలి కానీ తనను పవన్ మాజీ భార్యగా గుర్తించ వద్దు అంటూ ఆమె ఓపెన్ గానే అనేకసార్లు కామెంట్స్ చేసింది. 

గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ మౌనంగా ఉంటున్న రేణు దేశాయ్ షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు లేటెస్ట్ గా ఆమెకు పవన్ అభిమానులకు మధ్య మాటల యుద్ధాన్ని క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా అకిరా తన చెల్లి ఆధ్యను ఎత్తుకున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోకు ఆమె ఒక కామెంట్ కూడ జత చేసింది.  

‘1 2 3 అని లెక్కించే లోపు నీ ముందు ఉంటాను. ఇద్దరు క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరికి నేనున్నాను వారు నా సొంతం’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో కొందరు ఆమెను ట్రోల్ చేస్తూ ‘ఎంతైనా వారిద్దరిలో ఉన్నది పవన్ కళ్యాణ్ రక్తం కదా’ అన్న అర్ధం వచ్చేలా కామెంట్స్ పెట్టారు. అయితే ఈ కామెంట్స్ కు రేణు దేశాయ్ చాల ఘాటుగా స్పందించింది. తన పిల్లలలో ఉంది తన రక్తం అంటూ సైన్స్ తెలియకపోతే చదువుకుని కామెంట్ చేయండి అంటూ పవన్ అభిమానులకు రేణు దేశాయ్ క్లాసు పీకింది. 

దీనితో కొందరు పవన్ అభిమానులు రేణుకు రివర్స్ క్లాస్ పీకుతూ మరీ అంత కఠినంగా పవన్ అభిమానులతో మాట్లాడవద్దు రాబోయే రోజులలో అకిరా పవన్ వారసుడుగా ఫిలిం ఎంట్రీ ఇస్తే ఆ సినిమాలను చూడవలసింది తామే కదా అంటూ జోక్ చేసారు. ఈ జోక్ ను కూడ సీరియస్ గా తీసుకున్న రేణు అకిరా హీరో అవుతాడో లేదో తనకు తెలియదు కానీ అతడిలో ఉన్నది తన రక్తం మాత్రమే అని చెపుతూ తన నుండి అకిరాను ఏ శక్తి విడదీయలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: