అనేక చర్చలు తరువాత ‘అల వైకుంఠపురములో’ మూవీ రన్ టైమ్ ను 2 గంటల 40 నిముషాల నిడివితో ఫిక్స్ చేసి ఫైనల్ కాపీ ఎడిటింగ్ పై త్రివిక్రమ్ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఎడిటింగ్ స్టేజ్ లో ఇప్పటికే ఈ మూవీని చూసిన కొందరు చెపుతున్న లీకులు ప్రకారం ఈమూవీ భవిష్యత్ మూడు అంశాల పై ఆధారపడి ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. 

ఈ మూడు అంశాలు ఈమూవీకి సంబంధించిన సెకండ్ హాఫ్ లో హైలెట్స్ గా మారతాయి అని అంటున్నారు. ముఖ్యంగా ఈ మూవీ ప్రీ క్లైమాక్స్ ముందు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించే ఒక కామెడీ ఎపిసోడ్ ఉంటుందని ఆ కామెడీ ఎపిసోడ్ లో ఈ మూవీలోని కీలక నటీనటులు అందరు నటించారని టాక్. 

కామెడీ ట్రాక్ తరువాత క్లైమాక్స్ ముందు శ్రీకాకుళం యాసలో ఉండే పాట  ఉంటుందనీ ఈ పాటలో విలన్ తో పాటు హీరో కూడ ఈ పాటలో కనిపిస్తాడని సమాచారం. దాని తరువాత క్లైమాక్స్ లో వచ్చే భారీ ఫైట్ లో కొన్ని వెరైటీ యాక్షన్ సీన్స్ కనిపిస్తాయని ఈ మూడు అంశాలు ‘అల వైకుంఠపురములో’ ను నిలబెట్టి తీరతాయి అని అంటున్నారు. 

ఇప్పుడు ఈ వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో లీక్ అవ్వడంతో ‘అల వైకుంఠపురములో’ త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ స్ట్రాటజీ అనుసరించాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఆ మూవీలో కూడ సెకండ్ హాఫ్ లో ‘కాటమరాయుడా’ అంటూ ఫోక్ సాంగ్ ఉంది. అదేవిధంగా ‘అత్తారింటికి దారేది’ సెకండ్ హాఫ్ లో వచ్చే గౌతముడు అహల్య కామెడీ ట్రాక్ సీన్స్ లో ఆ మూవీలోని కీలక నటీనటులు అంతా నటించారు. దీనితో ఖచ్చితంగా ‘అల వైకుంఠపురములో’ కూడ పవన్ ‘అత్తారింటికి దారేది’ టేకింగ్ ఛాయలు కనిపిస్తాయా అంటూ ఇప్పుడు ఒక సరికొత్త గాసిప్ హడావిడి చేస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: