దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి బిగ్‌ షాక్ ఇచ్చాడా అనిపిస్తుంది. ఎందుకంటే, తన అన్న కొడుకు సింహ, కాల భైరవ నటించిన మత్తువదలరా సినిమా ముచ్చట్లు చెబుతున్నాడు. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన టాపిక్ అసలు తీయడం లేదు.  ఇకపోతే మత్తువదలరా టీం తో గత వారం రోజులుగా ప్రమోషన్స్ చేస్తున్న రాజమౌళి…  ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన స్పెషల్ లుక్ కానీ టైటిల్ కానీ ఈ న్యూ ఇయర్ కి విడుదల చెయ్యబోతున్నాడంటూ వార్త ప్రచారం జరిగింది.

 

 

ఇదే కాకుండా గతంలో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడే.. ఫస్ట్ లుక్ రివీల్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టైటిల్ కానీ.. లేదంటే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ల లుక్ కానీ విడుదల చేస్తాడంటూ.. సోషల్ మీడియాని ఓ న్యూస్ ముంచెత్తింది. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలై ఏడాది గడిచినా సినిమా టైటిల్ విషయంలో రాజమౌళి చేసే తాత్సారం చూస్తుంటే…. ఆసలు  ఆర్ఆర్ఆర్ టైటిల్ కొత్తగా పెడతారా… లేదంటే ఆర్ఆర్ఆర్ ని అలానే ఉంచేస్తారా అనేది కూడా సస్పెన్స్ గానే ఉందట. ఇకపోతే సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ అంటూ ప్రచారం జరుగుతుంటే కొందరు మాత్రం  31st నైట్ కానీ, జనవరి 1 న్యూ ఇయర్ రోజు కానీ  ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారంటుండగా, ఈ సినిమాకి సంబంధించిన హీరోలు ఇప్పటివరకు స్పందించలేదనే డౌట్ కొందరిలో మొదలైంది..

 

 

ఇదిలా ఉండగా ఫస్ట్ లుక్ విడుదల అంటే ఆ హంగామా మూడు రోజుల ముందే మొదలవుతుంది. జాతీయ మీడియాని ఆకర్షించాలంటే ఆ హంగామా కంపల్సరీ.. ఆ విషయం జక్కన్నకి తెలియంది కాదు. కానీ.. ఇంత నీరసంగా ఫస్ట్ లుక్ ని రాజమౌళి విడుదల చెయ్యరు. ఏమైనా  ఆర్ఆర్ఆర్ టైటిల్ రివీల్ విషయాలు ఉంటే ఈ సంక్రాంతికి ఉండొచ్చామో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. జులై 30 న విడుదల కాబోయే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ని రాజమౌళి పక్కా గా ప్లాన్ చెయ్యడంతో.. ఎలాంటి విషయాలు బయటికి పొక్కడం లేదని.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ని మంచి రోజు చూసి రాజమౌళి మొదలెడతాడేమో అనే టాక్ కూడా నడుస్తుంది. మరి ఈ న్యూ ఇయర్ కి ఆర్ఆర్ఆర్ ట్రీట్ ఉంటుందా? లేదా? ఈ రోజు దాదాపు క్లారిటీ వస్తుందంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: