స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యొక్క అల వైకుంఠపురములో సినిమాసంక్రాంతి పండుగ రోజున సందడి చేయనుంది. అల్లు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల వైకుంఠపురంలో సినిమాలో ఇప్పటివరకు విడుదలైన మొత్తం 4 పాటలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా 'సామజవరగమణ', 'రాములో రాముల' సంచలనాత్మక హిట్స్ గా నిలిచాయి, యూట్యూబ్ లో ఈ రెండు పాటలు ఒక్కొక్కటి 100 మిలియన్ వ్యూస్ సంపాదించాయి.

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురంలో సినిమాను పక్కా హిట్ గా మార్చేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాను సిద్ధం చేశాడు మాటల మాంత్రికుడు. సినిమాలో మూడు హైలైట్ పాయింట్లు ఉన్నాయని, ఇవన్నీ సినిమా సెకండ్ హాఫ్ లో వస్తాయిని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ మూడు సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్ర బృందం ఆత్మవిశ్వాసంతో ఉంది.

 

అల వైకుంఠపురంలో ప్రీ-క్లైమాక్స్ లో హిలేరియస్ కామెడీ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. ఈ కామెడీ ఎపిసోడ్ లో ప్రధాన తారాగణం ఉంటుందని తెలుస్తోంది, దీని తరువాత శ్రీకాకుళం ఆధారిత జానపద పాట ప్రేక్షకులను అలరించనుంది. ఆ తరువాత భారీ ఫైట్ సీన్ తో సినిమా ముగుస్తుంది. మొత్తంమీద, ఈ మూడు ఎపిసోడ్లు ఈ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి. ఈ సీన్లతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

 

ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా పూజా హెగ్డే నటించగా, టబు, నివేదా పెతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిషోర్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, మురళి శర్మ, మరియు ప్రధాన పాత్రల్లో నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: