క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పై తనకు క్రష్ ఉంది అంటూ శ్రీదేవి కూతురు జాన్వీ కూడ ఓపెన్ గా చెప్పింది. అలాంటి విజయ్ దేవరకొండతో తనకు నటించడం ఇష్టం లేదు అంటూ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పడం చాల మందికి షాక్ ఇచ్చింది. 

ఈ ఏడాది రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ఆమె నటించిన ‘ఆర్డీఎక్స్ లవ్’ ఫెయిల్ అయింది. ఈమధ్యనే విడుదలైన ‘వెంకీ మామ’ సక్సస్ అయినప్పటికీ ఆ మూవీలో ఆమె లుక్ బాగాలేదు అంటూ కామెంట్స్ వచ్చాయి. దీనితో ఇప్పుడు ఆమె ఆశలు అన్నీ జనవరిలో రాబోతున్న ‘డిస్కో రాజా’ పై ఉన్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో రాబోతున్న కొత్త సంవత్సరం సందర్భంగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చే కామెంట్స్ చేసింది. ప్రభాస్ విజయ్ దేవరకొండ సినిమాలకు సంబంధించి హీరోయిన్ గా అవకాశాలు ఒకేసారి వస్తే ఏ హీరోని వదులుకుంటావు అని ఎదురైనా ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు ప్రభాస్ అంటే పిచ్చి అని అతడితో నటించడానికి విజయ్ దేవరకొండను వదులుకుంటాను అంటూ రిప్లయ్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. 

సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు హీరోయిన్స్ చాల తెలివిగా సమాధానాలు ఇస్తారు. ఎవర్నీ హర్ట్ చేయకుండా తమ డేట్స్ ఇద్దరికీ సద్దుబాటు చేసి కష్టపడతాము అంటూ తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకుంటారు. అయితే పాయల్ మాత్రం ఈతీరుకు భిన్నంగా తన మనసులోని మాటను చాల స్పష్టంగా చెప్పి తన తీరు వేరు అని అందరికీ తెలిసేలా చేసింది. ఈ మాట తీరు వల్లనే కాబోలు పాయల్ కు మంచి గ్లామర్ ఉన్నా ఆమెతో నటించడానికి పేరున్న యంగ్ హీరోలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: