తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కు కూడా కొదవ లేదు. కంటెంట్ ఏమాత్రం మన తెలుగు ప్రేక్షకుల మనసులకు హత్తుకున్నా.. ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. దశాబ్దకాలంగా టాలీవుడ్ లో నమోదైన ఇండస్ట్రీ హిట్స్ కొన్ని ఉన్నాయి.

 

 

ఈ దశాబ్దంలో నమోదైన తొలి ఇండస్ట్రీ హిట్ సినిమా అంటే ఖచ్చితంగా పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమానే. ఈ సినిమా విజయం ఓ సంచలనం అనే చెప్పాలి. ఓవైపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో విడుదల కూడా అనుమానంగా ఉన్న పరిస్థితులవి. ఊహించని విధంగా ఈ సినిమా పైరసీకి గురైంది. ఒక్క రోజులోనే సెల్ ఫోన్లలోకి సినిమా ఇంటర్వెల్ వరకూ క్వాలిటీ ప్రింట్ చేరిపోయింది. వెంటనే మేల్కొన్న మేకర్స్ కేవలం మూడు రోజుల్లో సినిమాను విడుదల చేశారు. ఎంత పైరసీ అయినా.. ప్రేక్షకులు ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. సినిమా భారీ విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి నాలుగేళ్ల నుంచీ ఉన్న మగధీర రికార్డులను చెరిపేసింది. తర్వాత బాహుబలి వచ్చి ఈ రికార్డులను తిరగరాసింది. అనంతరం మహేశ్ శ్రీమంతుడు నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. తర్వాత చిరంజీవి ఖైదీ నెం.150 వచ్చి శ్రీమంతుడు రికార్డులను బీట్ చేసి కొత్త రికార్డులు సృష్టించింది.

 

 

తర్వాత ఏడాది వచ్చిన బాహుబలి2 జాతీయస్థాయి రికార్డులు క్రియేట్ సంచలనం నమోదు చేసింది. 2018లో వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం సినిమా భారీ విజయం సాధించి తెలుగులో నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఏడాది చిరంజీవి సైరా తెలుగు వెర్షన్ లో రంగస్థలం రికార్డులను చెరిపేసింది. ఈ సినిమాలన్నీ తెలుగు సినిమా స్ధాయి, సత్తా చాటాయని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: