ఆకలి మనిషిని ఎంతదూరమైనా నడిపిస్తుంది.  ఎన్ని పనులైనా చేయిస్తుంది.  ఇది డైలాగ్ మాత్రమే కాదు.  అక్షర సత్యం కూడా.  ఆకలేస్తుంది అని ఎవరైనా అడిగితె తప్పకుండా సహాయం చేస్తుంటారు.  అందుకే ఆకలిగా ఉండే వ్యక్తి ఎక్కువగా కష్టపడుతూ ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుంటారు.  కానీ, కొంతమంది మాత్రం అస్సలు పట్టించుకోరు.  ఆకలి అన్నా కూడా పట్టించుకోకుండా దొరికింది తినేది పక్కకు వెళ్లిపోతుంటారు.  


సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి బాధలు ఎక్కువగా ఉంటాయి.  ఆకలితో కడుపు మాడ్చుకుంటూ అవకాశాల కోసం రోడ్డుపై తిరిగే వ్యక్తులు ఎందరో ఉన్నారు.  వారంతా ఎలాగైనా సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి.  సినిమాల్లో ఎదగాలని వస్తారు.  దొరికింది మాత్రమే తింటూ దొరకనప్పుడు కడుపు మాడ్చుకుంటూ ఉంటారు.  అందరూ అలా ఉంటారని కాదు.  


ఇక ఇదిలా ఉంటె, ఓ స్టార్ హీరోయిన్ దక్షిణాది సినిమాల్లో నటించే సమయంలో కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురయ్యాట.  అవేమంటే... దక్షిణాది సినిమాల్లో హీరోలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.  లంచ్ సమయంలో హీరో తిన్న తరువాతే మిగతా వాళ్ళు తింటారట.  ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది నేహా ధూపియా.  నేహా ధూపియా దక్షిణాది సినిమాలు చేసే సమయంలో షూటింగ్ మధ్యలో ఆకలేస్తే తనకు ఆకలేస్తుంది అని అడిగిందట.  
కానీ, ముందు హీరో తినాలి.. ఆ తరువాతే అని చెప్పారట.

 

 కొంతసేపటి తరువాత మరలా అడిగితె హీరో షాట్ రెడీ గా ఉన్నది.  అయన తినేసి వెళ్ళాక తినొచ్చని అన్నారట.  అది పెద్ద విషయం కాదని ఆమె పట్టించుకోలేదట అప్పట్లో.  దక్షిణాది సినిమా రంగంలో హీరోలకు  పెద్దపీట వేస్తున్నారు అనే చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అంటోంది నేహా ధూపియా.  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పుకొని బిజినెస్ రంగంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లికూడా అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: