టాలీవుడ్ మోస్ట్ పాపులర్ జోడీ సమంత -నాగ చైతన్య. వీళ్లిద్దరు తొలిసారి 'ఏమాయ చేసావే' చిత్రంలో కలిసి పనిచేసారు. ఈ సినిమాకి సమంతకి మొదటి సినిమాకాగా, నాగ చైతన్యకు రెండో సినిమా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా అలరించారు. ఆ తర్వాత మనం, ఆటో నగర్ సూర్య చిత్రాలలో కలిసి నటించారు. ఇక పెళ్లి అనంతరం మజిలీ అనే సినిమాలో కలిసి నటించారు. పెళ్లి తర్వాత ఎలాంటి ఎమోషనల్ సినిమాలో అయితే నటించాలి అనుకున్నారో.. అచ్చంగా అలాంటి కథనే తీసుకొచ్చాడు శివ నిర్వాణ. 

 

వాళ్ల మజిలీని మరింత అందంగా మార్చేసాడు. ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ జంటతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. వాస్త‌వానికి  హిట్ అన్నదే లేని నాగ చైతన్యకు పెళ్లి త‌ర్వాత‌ భార్య సామ్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. పెళ్లి తర్వాత వచ్చిన చిత్రంలో కూడా వీరిని చూసేందుకు ఆడియన్స్ బాగానే ఇంట్రెస్ట్ చూపెట్టారు. మరోవైపు సమంత.. ముఖ్యపాత్రలో నటించిన ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. అయితే ‘ఓ బేబీ' తర్వాత అక్కినేని వారి కోడలు నటించిన చిత్రాలు ఏమీ విడుదల కాలేదు. కానీ.. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96' తెలుగు రీమేక్‌లో శర్వానంద్ సరసన నటించిన సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసింది. 

 

అలాగే, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలోకి అడుగు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక నాగ చైతన్య ఈ ఇయర్ ఎండ్.. తన మేనమామ వెంకటేష్‌తో కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాల్లో ‘మజిలీ’ క్లాస్ మూవీ అయితే.. ‘వెంకీ మామ’లో మాత్రం మాస్ లుక్‌తో అలరించాడు. ఏదేమైనా ఈ రెండు సినిమాలతో 2019లో  వరుసగా రెండు హిట్స్ అందున్నాడు. ఈ రకంగా  2019లో సమంతతో పాటు నాగ చైతన్యకు వెరీ స్పెషల్ అనే చెప్పాలి. కాగా, త్వరలో వీళ్లిద్దరు గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో కలిసి నటించబోతున్నారు. మ‌రియు ఈ జంట న్యూ ఇయర్ ఎండ్‌ను గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: