పారిశ్రామిక వార్తల పై బడా సెలెబ్రెటీల పై ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ జరగడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు వెండితెర పై ఇన్ కమ్ టాక్స్ కమీషనర్ గా నాగార్జున కనిపించబోతూ ఆ అధికారుల పై వచ్చే రాజకీయ ఒత్తిడి బెదిరింపులకు సంబంధించిన పాత్రలో నాగార్జున చాల సహజంగా నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 

‘మన్మధుడు 2’ ఫెయిల్యూర్ తో నాగార్జున తన నుంచి ఎలాంటి పాత్రలు ప్రేక్షకులు ఆశిస్తున్నారో అర్ధం అయింది. దీనితో వాస్తవానికి దగ్గరలో ఉండే కథల ఎంపిక పై నాగ్ తన దృష్టి పెట్టాడు. క్రియేటివ్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చెప్పిన ఒక వెరైటీ కథకు నాగ్ ఓకె చెప్పినట్లు టాక్.

‘పి ఎస్ వి గరుడవేగ’ మూవీ సక్సస్ తరువాత ప్రవీణ్ సత్తార్ తో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అయితే యంగ్ డైరెక్టర్స్ ను ఎప్పుడు ప్రోత్సహించే నాగార్జున ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ కథకు ఓటు వేసాడు. బాలీవుడ్ మూవీ రైడ్ కథకు మన తెలుగు ప్రేక్షకుల అభిరుచి ప్రకారం చాల మార్పులు చేసి నాగ్ కు సూట్ అయ్యేవిధంగా ఈ స్క్రిప్ట్ ను ప్రవీణ్ సత్తార్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

భారతదేశంలో సంపాదన ఉండి కూడ ట్యాక్స్ లు ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను అత్యంత భారీ సంపాదన కలిగి ఉన్న పారిశ్రామిక వేత్తలు ఏ విధంగా ట్యాక్స్ లను ఎగ్గొట్టి దేశానికి హాని చేస్తున్నారు అన్నవిషయం సాధారణ ప్రేక్షకుడుకు కూడ అర్ధం అయ్యే విధంగా ఈ మూవీలోని సీన్స్ ఉంటాయి అని అంటున్నారు. ఇప్పటి వరకు అనేకసార్లు పోలీసు పాత్రలను చేసిన నాగార్జున మొట్టమొదటిసారి తన కెరియర్ లో ఇన్ కమ్ టాక్స్ కమీషనర్ గా కనిపించడం ఒక మార్పు. ఈ మూవీ సక్సస్ అయితే పోలీసు పాత్రలను చేయడం ఒక సాంప్రదాయంగా మార్చుకున్న మన హీరోలు ఇప్పుడు నాగార్జున బాటలో కొనసాగే ఆస్కారం ఉంది..      

మరింత సమాచారం తెలుసుకోండి: