‘సరిలేరు నీకెవ్వరు' డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌ ప్రోమోలో మహేష్‌ వేగంగా డాన్స్‌ చేయడం చూసి మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా మహేష్ డాన్స్ మూమెంట్స్ పై జోక్స్ వేసే విమర్శకులు కూడ షాక్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ తన తండ్రి నటనను ఎప్పుడు అనుసరించక పోయినా అతడు    స్వతహాగా మహేష్ డీసెంట్‌ డాన్సర్  అయినప్పటికీ గత కొంతకాలంగా డాన్స్‌ ల పరంగా మహేష్‌ చాలా బద్ధకం చూపిస్తున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. 

దీనితో మహేష్ పై అనేక సార్లు ట్రోలింగ్ కూడ జరిగింది. వాస్తవానికి మహేష్ తో సినిమాలు తీయడానికి టాప్ దర్శకులు అందరు ఆశక్తి కనపరిచినా మహేష్ ను డాన్సర్ గా ఎలివేట్ చేయడానికి ఇప్పటి వరకు ఏ టాప్ దర్శకుడి ప్రయత్నించలేదు. దీనితో మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి మాత్రం మహేష్ తో సినిమా చేసే ముందు జరిగిన చర్చలలో తన మూవీలో మహేష్‌ డాన్స్‌లు చేయాల్సిందేనని పట్టుబట్టాడు అన్న వార్తలు ఉన్నాయి.  

దీనితో అనీల్ రావి పూడి పై ఉన్న గౌరవంతో మహేష్ కాదనలేకపోయాడు అన్న ప్రచారంజరుగుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ  డాంగ్‌ డాంగ్‌ పాటలో మాత్రమే కాదు మైండ్‌ బ్లాక్‌ పాటలోను మహేష్‌ చేసిన డాన్స్‌ లు అదరగొట్టేసినట్టు టాక్‌. ఈ రెండు పాటలు ఫ్యాన్స్‌ కి ఫీస్ట్‌లా ఉంటాయట.  

వాస్తవానికి  డాంగ్‌ డాంగ్‌ పాట వద్దని మహేష్ ఎంతో వాదించినా అనుకున్నారు కానీ ‘అల వైకుంఠపురములో’ పాటలు అంత హిట్‌ అవడంతో మ్యూజికల్‌ గా ఆ సినిమాకి కంప్లీట్‌ ఎడ్జ్‌ ఇవ్వకూడదని ఈ పాటను యాడ్‌ చేసి తీరాలని అనీల్ రావిపూడి పట్టుపట్టడమే కాకుండా తమన్నాకి డబుల్‌ పారితోషికం ఇచ్చి మరీ పాటని చాలా త్వరగా ఫినిష్‌ చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు మహేష్ కు స్టెప్స్ పట్ల ఉండే భయాన్ని పోగొట్టే బాధ్యతను శేఖర్ మాస్టర్ కు అప్పచెప్పి మహేష్ కు డాన్స్ పట్ల మోజు పెరిగేలా శేఖర్ మాష్టర్ చేత అనీల్ రావిపూడి మహేష్ ను మోటివేట్ చేయించాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: