బాలీవుడ్ 2019 బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ లో సినిమా హిట్టైతే ఆ వసూళ్ల లెక్క ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ ఇయర్ ఆశించిన స్థాయిలో ఉన్న సినిమాలు కొన్నైతే.. అంచనాలు అందుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. 2019 బాలీవుడ్ టాప్ 3 మూవీస్ పై ఏపిహెరాల్డ్.కామ్ స్పెషల్ ఫోకస్..

 

దుమ్ముదులిపేసిన 'వార్' :

 

2019 బాలీవుడ్ లో వసూళ్ల పరంగా టాప్ 1 ప్లేస్ లో ఉంది వార్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ శ్రాఫ్ గురు శిషులుగా నటించిన సినిమా వార్. సిద్ధార్థ్ ఆనంద్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ పై తన సత్తా చాటింది. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 319 కోట్లు వసూళు చేసింది. బాలీవుడ్ లో 300 కోట్లు దాటిన 8వ సినిమాగా వార్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

 

ముఖ్యంగా ఈ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను బాగా అలరించాయి. హృతిక్ రోషన్ సినిమా హిట్టు కొడితే ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది.

 

'కబీర్ సింగ్' కుమ్మేశాడు :

 

కొన్నాళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ లేని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ చేసిన క్రేజీ మూవీ కబీర్ సింగ్. తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డికి రీమేక్ గా ఆ సినిమా దర్శకుడు సందీప్ వంగ హిందిలో ఈ సినిమా చేశారు. ఈ మూవీలో షాహిద్ కు జోడీగా కియరా అద్వాని నటించింది. కబీర్ సింగ్ సినిమా 278.24 కోట్లు వసూళు చేసి షాహిద్ కెరియర్ బెస్ట్ మూవీగా నిలిచింది.

 

అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండని ఫాలో అవకుండానే షాహిద్ కపూర్ కబీర్ సింగ్ లో చూపించిన అభినయం ఆడియెన్స్ ను ముఖ్యంగా అతని ఫ్యాన్స్ ను మెప్పించింది. తెలుగులో లానీ కబీర్ సింగ్ సినిమా మీద కూడా బాలీవుడ్ లో విమర్శల వెళ్లువ వచ్చినా ఆ ఎఫెక్ట్ కలక్షన్స్ మీద మాత్రం పడలేదని చెప్పొచ్చు. కబీర్ సింగ్ ఈ ఇయర్ బాలీవుడ్ టాప్ 2 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్ తో షాహిద్ కపూర్ నాని సూపర్ హిట్ మూవీ జెర్సీని హిందిలో రీమేక్ చేస్తున్నాడు. 

 

'ఉరి' బాక్సాఫీస్ పై సర్జికల్ స్ట్రైక్ : 

 

సర్జికల్ స్ట్రైక్ ఆధరంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ఉరి. ఆదిత్య ధార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, యామి గౌతం లీడ్ రోల్ లో నటించారు. 40 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి 245 కోట్లను వసూళు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసింది.

 

కంటెంట్ ఉన్న సినిమాకు ఎక్కడైనా ప్రేక్షకుల నీరాజనాలు ఉంటాయని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఉరి. ఈ సినిమా కమర్షియల్ గానే కాదు సెలబ్రిటీస్ ల మనసులను గెలుచుకుంది. సినిమాపై చాలామంది సెలబ్రిటీస్ ట్వీట్ చేయడం గొప్ప విషయం. 2019 టాప్ మూవీస్ లో 3వ ప్లేస్ లో స్థానం సంపాదించుకుంది ఉరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: