ఓ సినిమాకు హీరో ఎంత ముఖ్య‌మో.. విల‌న్ కూడా అంతే ముఖ్యం. క్లారిటీగా చెప్పాలంటే .. విల‌న్ లేనిదే హీరో లేడు.  హీరో మంచితనం, గొప్పతనం ప్రతిబింబించాలంటే తప్పనిసరిగా ప్రతినాయకుడి పాత్ర ఉండి తీరాల్సిందే. అందుకే ప్రతినాయకుడి పాత్రను ఎంపిక చేసేటప్పుడు దర్శక, నిర్మాతలు పరిపరివిధాలుగా ఆలోచిస్తుంటారు. బాడీలాంగ్వేజ్‌ మొదలుకుని కర్కశత్వాన్ని అంటే అధికశాతం రౌద్ర రసాన్ని ప్రదర్శించగల నటులనే విలన్ల పాత్రలు వరిస్తుంటాయి.  విలన్ ఎంత భాగా నెగిటివ్ కెరెక్టర్ చేస్తాడు అన్న దాన్ని బట్టి సినిమా హిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది విలన్స్ ఉన్నారు. 

 

అయితే అందులో టాప్ 3 విల‌న్స్‌పై ఓ లుక్కేసేయండి. ఇందులో ముఖ్యంగా జ‌గ‌ప‌తిబాబు. యస్.వి. కృష్ణరెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో పనిచేసాడు. అయితే హీరోగా అవకాశాలు తగ్గిపోయిన తరువాత బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన సూపర్ డూప‌ర్ హిట్ మూవీ లెజెండ్ లో ప్రతినాయకుడిగా  నటించి , విలన్ అంటే ఇలా ఉండాలి అనిపించాడు. ఇక జగపతి బాబు హీరోగా ఉన్నప్పటి కంటే విలన్ గానే ఎక్కువ సంపాదిస్తున్నాడు.  ఒక్కో సినిమాకు రెండు కోట్లు తీసుకుంటున్నాడట.

 

అలాగే వివేక్ ఒబెరాయ్‌.  రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా కంపెనీ చిత్రంతో తెరంగేట్రం చేశారు వివేక్. సాతియా, మస్తీ, యువ, ఓంకారా, గ్రాండ్ మస్తీ వంటి ఎన్నో పేర్కొనదగ్గ చిత్రాల్లో నటించారు. క్రిష్ 3 సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. అయితే హీరోగా ఉంటూ ఇటీవల తెలుగులో వినయ విధేయరామ, కల్కి వంటి సినిమాల్లో విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే విధంగా.. చంకీ పాండే. బాలీవుడ్ మూవీ ‘హౌస్ ఫుల్’ సినిమా చూసిన వాళ్లకు చుంకీ పాండే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆయన ఆకట్టుకున్నాడు. అలాంటిది ఇటీవ‌ల వ‌చ్చిన సాహో’ సినిమాలో విల‌న్‌గా త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నాడు. వీళ్ల‌తో పాటు  మిర్చి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంపత్ రాజ్, అనేక సినిమాల్లో విల‌న్‌గా న‌టించిన ప్ర‌కాష్ రాజ్ ఇలా ఎంద‌రో విల‌న్స్ టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: