స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ సామజవరగమన ఆడియో సాంగ్ తో అదరగొట్టగా ఈ సాంగ్ వీడియో కోసం బన్ని ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని ప్రియులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూశారు.

 

న్యూ ఇయర్ గిఫ్ట్ గా 2019 కి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేలా ఈరోజు కొద్ది నిమిషాల క్రితం అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. లీడ్ పెయిర్ అల్లు అర్జున్, పూజా హెగ్దెల మధ్య రొమాంటిక్ గా సాగే ఈ సాంగ్ చాలా క్రేజెగా ఉండనుంది. ఆడియో సూపర్ హిట్ అవగా వీడియోపై భారె అంచనాలు పెట్టుకున్నారు.

 

అయితే ఈ సాంగ్ వీడియో ప్రోమో చూస్తే మాత్రం ఫ్యాన్స్ నిరాశ చెందారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆల్రెడీ టీజర్ లోనే బన్ని లుక్ పై రకరకాల విమర్శలు రాగా ఈ సాంగ్ లో మరోసారి నిరాశపరచాడు. ఫారిన్ లొకేషన్స్, పక్కనే పూజా హెగ్దె ఉన్నా సరే సాంగ్ రేంజ్ కు తగినట్టుగా విజువల్ లేదని చెప్పొచ్చు.

 

థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సామజవరగమన వీడియో ప్రోమో ఆశించిన స్థాయిలో లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృస్టిస్తుందో చూడాలి. సినిమాకు పోటీగా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: