సినిమా అనగానే పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరం. అదిగాక సినిమా ప్రారంభించింది మొదలు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ, శ్రమను మౌనంగా భరిస్తూ అనుకున్న సమయానికి అన్ని సవ్యంగా జరిగి ఆ సినిమా రిలీజ్ అయ్యి పెట్టిన పెట్టుబడి వచ్చినా ప్రోడ్యూసర్ ఊపిరి పీల్చుకుంటాడు. లేకపోతే అతని బాధ వర్ణాణీతం.

 

 

ఇకపోతే ఇక కొన్ని గంటల్లో ఈ సంవత్సరంలో ఉన్న జ్ఞాపకాలను పాతవిగా చేసి కొత్త ఆశలతో నూతన సంవత్సరం ప్రతి వారి జీవితంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా సినీ అభిమానులకోసం 2019లో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసి పలు తెలుగు సినిమాలు భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. అలాంటివాటిలో ఆన్ లైన్లో పెట్టి పెట్టగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయి పలు సినిమాల టికెట్లు సరికొత్త ట్రెండ్‌కు తెరతీసాయి. అలాంటి వాటిలో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రానికి మొదటి స్థానం దక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019 లో ఈ సినిమా విడుదలైంది...

 

 

ఇక ఇక రెండో స్థానంలో నిలిచిన  మజిలీ. పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత జంటగ నటించిన మజిలీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా టికెట్లు కూడా ఆన్ లైన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇకపోతే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని శ్రద్ధా శ్రీనాథ్‌ హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం జెర్సీ మూడో ప్లేస్‌లో నిలవగా పూరిజగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా నాలుగో స్థానం దక్కించుకుంది.

 

 

ఇక జెర్సీ లాంటి సినిమా తర్వాత నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ కూడా పెద్దగా ఆడకపోయినా ఆన్ లైన్ టికెట్ల అమ్మకం విషయంలో ఐదో స్థానం దక్కించుకోగా సమంత ఓ బేబీ సినిమా కూడా ఆన్ లైన్ టికెట్ల అమ్మకంలో ఆరో స్థానంలో నిలవగా, గద్దలకొండ గణేష్‌ సినిమా టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఇక రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ,  యువరత్న బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఆన్ లైన్ టికెట్ల అమ్మకాల్లలో టాప్ టెన్‌లో నిలిచాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: