టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ హిస్టారికల్ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు విలన్స్ కు సంబందించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేసిన సినిమా యూనిట్, 

 

ఇప్పటివరకు సినిమా ఫుల్ టైటిల్ ని కానీ, లేదా హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్లను కానీ రిలీజ్ చేయనే లేదు. ఇక ఓ వైపు మెగా ఫ్యాన్స్, మరోవైపు నందమూరి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వాటికోసంఎదురుచూస్తున్నారు. అయితే మొత్తానికి వారందరి ఎదురుచూపులకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా న్యూ ఇయర్ ట్రీట్ కోసం ఆర్ఆర్ఆర్  టీమ్ నుండి అప్ డేట్ కోసం పలువురు ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్వీట్స్ చేస్తూ కోరుతూ ఉండగా, ఎట్టకేలకు ఒక అభిమాని ట్వీట్ కు స్పందించిన ఆర్ఆర్ఆర్  మూవీ యూనిట్, 

 

తప్పకుండా మేము కూడా ఒక ట్రీట్ ని ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ సందర్భంగా అందించాలని చూస్తున్నాము, అలానే రాబోయే ఆ 2020ని ఆర్ఆర్ఆర్ నామ సంవత్సరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం అంటూ రీట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వారు చేసిన ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. మరి వారు ట్వీట్ చేసిన ప్రకారం ఈ సినిమా నుండి హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్లు వస్తాయా,లేక ఫుల్ టైటిల్ ని ప్రకటిస్తారా అనేది మాత్రం మరొక్క రోజు ఆగితేనేగాని తెలియదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: