తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ తేజస్వి మదివాడ, ప్రస్తుతం తన సెలవులను ఆస్వాదిస్తోంది తన హాట్ ఫోటోషూట్ తో యువతను హీటెక్కిస్తోంది ఈ భామ. 'ఐస్ క్రీమ్' బేబీ తన హాట్ ఫోటోషూట్లకు ఏ మాత్రం తగ్గదు, ఈసారి తేజస్వి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు పీసుల బికినీతో ఉన్న తన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో బికినీ ధరించిన తేజస్వి మదివాడ ఈత కొలను పక్కన కూర్చొని కనిపిస్తుంది.

 

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఐస్ క్రీమ్’ చిత్రంతో గ్లామర్ అవతార్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది తేజస్వి. షార్ట్ ఫిల్మ్‌తో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, 2013 లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రం చెట్టు చిత్రంతో వెండి తెరపై కనిపించింది. తేజస్వి అనేక చిత్రాల్లో నటించినప్పటికీ, టాలీవుడ్‌లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.

 

మరోవైపు తేజస్వి మదివాడ రాబోయే చిత్రం 'కమిట్మెంట్‌'లో నటిస్తోంది, ఇది కాస్టింగ్ కౌచ్‌ ప్రధానాంశంగా చిత్రీకరించబడుతోంది. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని నాలుగు ఎపిసోడ్ల కలిగిన సిరీస్ గా తీస్తున్నారు. తేజస్వి మదివాడ ఈ నాలుగు ఎపిసోడ్లలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో హాట్ మరియు బోల్డ్ దృశ్యాలలో కనిపిస్తుందని సమాచారం. రియాలిటీ షో బిగ్ బాస్ 2 లో కనిపించిన తేజస్వి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. షో లో తన టాస్కులతో ప్రత్యర్థులకు మంచి పోటీ ఇచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ బిగ్ బాస్ 2 లో కౌశల్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ షోలో తేజస్వి తన ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: