2019.. ఎన్నో సినిమాలు ఎన్నో హిట్లు.. ఎన్నో సూపర్ హిట్లు. ఇలా టాలీవుడ్ లో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలో కొన్ని హిట్ అయ్యాయి... కొన్ని సూపర్ హిట్ అయ్యాయి.. మరి కొన్ని ప్లాప్ అయినప్పటికీ వసూళ్లు తెచ్చిపెట్టాయి. అన్ని సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రమే టాలీవుడ్ గౌరవాన్ని పెంచాయి. ఆ సినిమాలు ఏవి ? ఆ సినిమా దర్శకులు ఎవరు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 


 
1. జెర్సీ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం. 

 

నాని కథనాయకుడిగా, శ్రద్ద శ్రీనాథ్ కధానాయికగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జర్సీ. ఈ సినిమా ఎంత అద్భుతం అంటే మన సినిమాను పక్క వారు తీసుకొని మళ్ళి రీమేక్ చేసుకునేంతగా ఆకట్టుకుంది. సినిమా అంత క్రియాటివ్ గా ఒక క్రికెటర్ జీవితం ఎలా.. కొడుకుపై తండ్రి ప్రేమ ఎంతటిది అన్ని ఎమోషనల్ గా గుండెకు హత్తుకునేలా సినిమా తీసి టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు క్రియాటివ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. 

 

2. బ్రోచేవారెవరురా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం. 

 

శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేదా పేతురాజు, సత్యదేవ్ కాంచరనలు ప్రధాన పాత్రల్లో నటించగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రోచేవారెవరురా. సినిమా అంత సస్పెన్సుతో కామెడీగా ఎంతో క్రియాటివ్ గా ఈ సినిమా నడుస్తుంది. అతి తక్కువ బడ్జెట్ అయినప్పటికీ టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను అలరించింది. 

 

3. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం. 


నవీన్ పోలిశెట్టి డిటెక్టీవ్ గా సస్పెన్స్ త్రిల్లర్ తో వచ్చిన ఈ సినిమాకు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహించారు. సినిమా అంత సస్పెన్స్ తో కొనసాగిన ప్రతి సన్నివేశంలో కామెడీ పెట్టి ప్రేక్షకులను టెన్షన్ టెన్షన్ తో నవ్వించిన సినిమా ఇది. ప్రేక్షకుల మనసు దోచుకొని మన సినిమా సస్పెన్సులోను ఫస్ట్ ఏ అని నిరూపించి సూపర్ హిట్ అయ్యింది. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ సినిమా అదిరిపోయింది. వీరేనండి.. మన కొత్త దర్శకులు.. ఈ సంవత్సరం టాప్ 3 దర్శకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: