టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సమయంలో కమెడియన్స్ అంటే ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం మరియు ఆలీ పేర్లు గట్టిగా వినిపించాయి. ముఖ్యంగా బ్రహ్మానందం సినిమాలో ఉంటే చాలు చాలా వరకు తెలుగు ప్రేక్షకులు సినిమా చూడటానికి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు. అంతగా బ్రహ్మానందానికి మార్కెట్ ఉండేది. ఇదే తరుణంలో ఎమ్మెస్ నారాయణ మరియు ఆలీకి కూడా అదే స్థాయిలో ఇండస్ట్రీలో రాణించాలంటే. అయితే ఎమ్మెస్ నారాయణ చనిపోవటం మరోపక్క బ్రహ్మానందం కి అవకాశాలు రోజురోజుకి తగ్గిపోవటం అనారోగ్యం పాలు కావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర కమెడియన్ల హవా జోరుగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో జబర్దస్త్ ఇలాంటి టీవీ కార్యక్రమాలలో రాణించిన వాళ్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తు నేపథ్యంలో సినిమా స్టోరీ లు కూడా హీరో చేతనే ఎక్కువగా కామెడీ ట్రాక్ నడిచేలా డైరెక్టర్లు స్టోరీ డిజైన్ చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ ముగ్గురు పేర్లు అంటే చాలామంది రాయాల్సి ఉంటుంది.

 

మొత్తంమీద చూసుకుంటే టాలీవుడ్ లో ప్రస్తుతం కామెడీ మంత్రం జప్పిస్తూ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో పర్టిక్యులర్ గా మాత్రం పేర్లు చెప్పటం కష్టం. అయితే ఈ ఏడాది ఎక్కువగా సీనియర్ టాప్ కమెడియన్ లలో అలరించింది మాత్రం అలి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకపక్క టెలివిజన్ రంగంలో రాణిస్తూ మరోపక్క ఎప్పటినుండో ఇండస్ట్రీలో తన మార్క్ కామెడీ ట్రాక్ ఎన్ని జనరేషన్ మారిన వచ్చే తరానికి తన కామెడీ యాప్ట్ అయ్యేలా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఏ మాత్రం తగ్గటం లేదు.

 

ఇదే తరుణంలో గతంలో సునీల్ సూపర్ కామెడీ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి అప్పట్లో టాప్ లో ఉన్న బ్రహ్మానందం కే చెమటలు పట్టించి హీరోగా ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్న ఇప్పుడు మళ్లీ కామెడీ ట్రాక్ నమ్ముకోవడం తో మెల్ల మెల్లగా సునీల్ పేరు కూడా ఇటీవల వినబడుతోంది. మొత్తంమీద చూసుకుంటే ఈ ఏడాది ఎక్కువగా టాప్ కమెడియన్ల పేరు అంటే కొత్త కొత్త నటులు చాలా మంది పేర్లు చెప్పొచ్చు. సీనియర్ లలో మాత్రం పోసాని కృష్ణ మురళి, ఆలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి పేర్లు చాలా గట్టిగా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: