ఇటీవల విడుదలై 124మిలియన్ల పై చిలుకు  వ్యూస్ తో సాంగ్ అఫ్ ది ఇయర్ అనిపించుకుంది అల... వైకుంఠపురములోని సామజవరగమన సాంగ్.  ఈఒక్క సాంగ్  సినిమా కు సూపర్ హైప్ ను తీసుకొచ్చింది. ఇంతలా  శ్రోతల మనసు దోచుకున్న ఈ సాంగ్ ను  తెరమీద మరింత అందంగా చూపించాలనుకున్నారు మేకర్స్.  అందుకే  సాంగ్ షూటింగ్  కోసం ఇటలీకి వెళ్లారు.  అక్కడి అందమైన లొకేషనల్లో  సాంగ్ ను చిత్రీకరించారు. ఇక ఈ సాంగ్ షూట్ కు అయిన ఖర్చు  అక్షరాలా 6కోట్లు.  మరింత  ఖర్చు పెట్టిందానికి న్యాయం జరిగిందా అంటే  వంద శాతం జరిగిందని  తాజాగా విడుదలైన ఈ సాంగ్ ప్రోమో చూస్తేనే అర్ద మవుతుంది.  సూపర్ క్వాలిటీ తో  పాట కు తగ్గ స్టెప్పులతో  అద్భుతంగా సాంగ్ ను చిత్రీకరించారని ప్రోమో చూస్తూనే తెలుస్తుంది. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన  ఈచిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా  టబు , జయరాం , మురళి శర్మ , సముద్ర ఖని , సునీల్ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజ్ వంటి స్టార్ క్యాస్టింగ్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్, రాధాకృష్ణ  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా  వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇక త్రివిక్రమ్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన  జులాయి, సన్ ఆఫ్  సత్యమూర్తి  సూపర్ హిట్లు అయ్యాయి. మరో ఈ మూడో సినిమా వీరికి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: