తమిళ ప్రజలకు ఒక్కసారి హీరో నచ్చితే గుండెల్లో గుడి కట్టుకుంటారు. అభిమానం చూపితే హీరోలను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా చేసేస్తారు. ప్రస్తుతం భారతదేశ చలనచిత్ర రంగంలో అన్ని సినిమా ఇండస్ట్రీలో కంటే కోలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువగా టాలెంట్ ఉన్న కథలను తెరకెక్కిస్తోంది. అంతే కాకుండా కొత్త కొత్త నటులకు కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉండేవిధంగా అక్కడ వాతావరణం కల్పిస్తూ ఉంటారు సీనియర్లు. టాలెంట్ ఉన్న వారిని బాగా ప్రోత్సహించడంలో కోలీవుడ్ ఇండస్ట్రీ ని మించిన ఇండస్ట్రీ మన దేశంలో లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా వరకు తమ కుటుంబాలు మరియు తమ బిడ్డలు మాత్రమే రాణించాలని ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకున్న ఇటువంటి రోజుల్లో టాలెంట్ వున్న నటులను ఎంకరేజ్ చేసే ఇండస్ట్రీ కోలీవుడ్ ఇండస్ట్రీ.

 

అయితే ఈ ఏడాది చాలా వరకు తమిళ ఇండస్ట్రీలో సినిమాలు వచ్చిన ఎక్కువగా నవ్వించిన కమెడియన్లు గురించి ఆలోచిస్తే వినబడే పేర్లు యోగిబాబు - సంతానం - వివేక్. గత దశాబ్ద కాలం నుండి కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లు అంటే ఎక్కువగా వినబడుతున్న పేర్లు ఈ ముగ్గురు పేర్లు. ముందుగా యోగిబాబు అయితే చాలా పెద్ద పెద్ద సినిమాలలో నటించి ఏడాది మొత్తం బిజీ కమెడియన్ హీరో గా కోలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాడు.

 

అదేవిధంగా సంతానం మరియు వివేక్ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాల్లో రాణిస్తూ తమకంటూ మార్కెట్ కోలీవుడ్లో క్రియేట్ చేసుకొని అనేక అవకాశాలు పొందుతూ తమిళ ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు ఈ ముగ్గురు కమెడియన్స్. ఇదే కాకుండా వచ్చే తరానికి ఇండస్ట్రీ లోకి రావటానికి ఇన్స్పిరేషన్ గా కూడా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మొత్తం మీద 2019 సంవత్సరంలో కోలీవుడ్ టాప్ 3 క‌మెడియ‌న్స్ అంటే వినిపించే ముగ్గురు పేర్లు యోగిబాబు - సంతానం - వివేక్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: