ఆరెక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన సెకండ్ సినిమాకు మహా సముద్రం అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఈ కథను రాం, నితిన్, నాగ చైతన్య చివరకు మాస్ మహరాజ్ రవితేజతో కూడా చేస్తున్నాడని వార్తలు రాగా వీళ్లెవ్వరు అజయ్ భూపతికి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తుంది. 

 

ఇక లేటెస్ట్ గా శర్వానంద్ మహా సముద్రం సినిమాకు కనెక్ట్ అయ్యాడట. సినిమా కథ విన్న శర్వానంద్ చాలా ఎక్సయిట్ అయినట్టు తెలుస్తుంది. రణరంగం ఫ్లాప్ తో కెరియర్ లో జాగ్రత్త పడుతున్న శర్వానంద్ మహా సముద్రం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను కూడా అజయ్ భూపతి చాలా క్రేజీగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

 

కేవలం శర్వానంద్ కోసమే కాదు ఈ కథ విని అతని మీద నమ్మకం పెట్టని హీరోలందరికి ఈ సినిమాతో సమాధానం చెప్పాలని అనుకుంటున్నాడు అజయ్ భూపతి. ఆరెక్స్ 100 రిలీజ్ ఏడాది దాటినా సరే అజయ్ తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. మరి శర్వానంద్ తో అయినా మహా సముద్రం పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

 

అజయ్ భూపతి, శర్వానంద్ ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. శర్వానంద్ నచ్చాడు అంటే కచ్చితంగా అజయ్ జబర్దస్త్ స్క్రిప్ట్ రాసుకుని ఉంటాడని అంటున్నారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది. శర్వానంద్ కు కమర్షియల్ హిట్ అవసరం ఉన్న ఇలాంటి టైం లో ఆరెక్స్ 100 డైరక్టర్ ఏం చేస్తాడో చూడాలి. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం అజయ్ భూపతి ఈ కథను చాలా బాగా రాసుకున్నాడని శర్వానంద్ కు పక్కా హిట్ వస్తుందని అంటున్నారు. ఈ సినిమా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తుందని తెలుస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: