సినిమా తీయాలి అంటే చిన్న నిర్మాతలు ఇప్పుడు దాదాపుగా భయపడే రోజులు. ఎందుకంటే సినిమా మొదలు పెట్టినప్పటి నుండి పూర్తైయ్యేవరకు ప్రోడ్యూసర్ అనే వ్యక్తి భరించవలసిన ఖర్చులు మామూలుగా ఉండవు. తడిసి మోపెడు అవుతాయి. ఇక సినిమాలోని సన్ని వేశాల చిత్రీకరణ ఒక ఎత్తైతే, అందులోని పాటల చిత్రీకరణ ఒక ఎత్తుగా మారింది. ఇక సినిమా మొదలైనప్పటి నుండి అది విడుదల అయ్యేవరకు ఆ చిత్ర బృందానికి నిదుర కూడా ఉండదు. ఇదంతా ఒకెత్తైతే అది విడుదలైయ్యాక వచ్చే టాక్‌ను బట్టి మరో టెన్షన్ మొదలు అవుతుంది.

 

 

ఇలా కొన్ని సినిమాలు మొదలు పెట్టాక సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకుని చివరికి రిలీజ్ కాకుండ ఉన్నాయి. మరి కొన్ని మొదలు పెట్టి కొంత భాగం చిత్రీకరణ జరిగాక కూడా ఆగిపోయాయి. ఇలాంటి ఘటనలు చిన్న హీరోల చిత్రాల్లో చూస్తాము. కానీ ప్రభాస్ లాంటి పెద్ద హీరోల విషయాల్లో కూడా ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఎందుకు అన్నానంటే. ప్రభాస్ నటిస్తున్న జాన్‌ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన మొద‌లెట్టారో ఏమో గానీ ఇప్పటివరకు న‌త్త‌న‌డ‌క‌లా సాగుతోంది. ఈ పాటికే సినిమా పూర్తి కావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది.

 

 

ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ ఎంతవరకు చేశారో, అది ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో ఇప్పటివరకు చిత్ర‌బృందం కూడా క్లారిటి ఇవ్వలేక పోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే వచ్చిన సమాచారం ఏంటంటే ఇదంతా సాహో ఎఫెక్ట్‌ అంటున్నారు. సాహో ఇచ్చిన కిక్కుతో జాన్ సినిమాలోని స్క్రిప్టులో మార్పులూ చేర్పులూ చేసుకుంటూ వెళ్తున్నారట. అంతే కాకుండా బ‌డ్జెట్ త‌గ్గించుకోవ‌డానికి కూడా చాలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారని తెలిసింది..

 

 

అయితే ఇప్పటికే కొన్ని ఖ‌రీదైన ఎపిసోడ్లు తీసి, ప‌క్క‌న పెట్టేశారు. అయినా స‌రే, ఈ సినిమా విషయంలో ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంది. అయితే క్రిస్మ‌స్ త‌ర‌వాత కొత్త షెడ్యూలు మొద‌లుకావాల్సింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ అవ్వ‌లేదు. ఇకపోతే సంక్రాంతి త‌ర‌వాతే షూటింగ్ మొదలు పెడతాం అనే వార్త వినిపిస్తుంది. కానీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 2020 ద‌స‌రాకి త‌ప్ప జాన్ విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిచండం లేదని అనుకుంటున్నారట.. ఒకవేళ అంత‌కంటే.. ముందుగా అంటే స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో విడుద‌ల చేస్తే అది అద్భుత‌మ‌నే చెప్పాలని కొందరు గుసగుసలు పెట్టుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: