మెగాస్టార్  చిరంజీవి నటించిన మాస్టర్  ఎంత పెద్ద హిట్టు అయ్యిందో  తెలిసిందే.  ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను  తమిళ  స్టార్ హీరో విజయ్ తన 64వ చిత్రం కోసం వాడుకుంటున్నాడు.  ప్రస్తుతం విజయ్, ఖైదీ ఫేమ్  లోకేష్  కనకరాజ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.  న్యూ ఇయర్  కానుకగా  కొద్దీ సేపటి క్రితం ఈ సినిమాలోని విజయ్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా  టైటిల్ ను కూడా రివీల్ చేశారు.  కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈచిత్రానికి మాస్టర్ అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్ తోపాటు విడుదలైన విజయ్ లుక్  కూడా ఆసక్తికరంగా ఉంది. 
 
ఇక గత కొద్దీ రోజులనుండి  నాన్ స్టాప్ షూటింగ్  జరుపుకుంటున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా  పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.  వీరితో పాటు ఆండ్రియా  జెర్మియా , శంతన్  భాగ్యరాజ్  ముఖ్య పాత్రల్లో  నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా  భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
 
ఇక  ఇటీవల విజయ్ నటించిన  సర్కార్ , బిగిల్ చిత్రాలు తమిళ్ తోపాటు  తెలుగులోనూ సూపర్ హిట్ కావడం అలాగే  లోకేష్ కనకరాజ్,ఖైదీ తో మంచి గుర్తింపు  తెచ్చుకోవడం తో  ఈ చిత్రంపై  తెలుగులో కూడా  మంచిఅంచనాలు వున్నాయి. కాగా  మాస్టర్ తెలుగు వెర్షన్ హక్కులను  యువ నిర్మాత , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల పీఆర్వో mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు 8.5కోట్లకు  దక్కించుకున్నాడని సమాచారం. వచ్చే ఏడాది  ఏప్రిల్ లో మాస్టర్ ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: