నూతన సంవత్సరం జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్న  విషయం తెలిసిందే. నూతన సంవత్సరం జనవరి 1 రోజున ఎంతోమంది పుట్టిన రోజులు కూడా జరుపుకుంటారు. నూతన సంవత్సర వేడుకలతో పాటు  వారి వారి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా ఎంతో మంది జనవరి 1న తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు సినీ రంగంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సినీ తారలు ఎవరో తెలుసుకుందాం రండి . 

 

 

 

సోనాలి బింద్రే : 1975 జనవరి 1వ తేదీన మహారాష్ట్రలోని బాంబే లు జన్మించింది సోనాలి బింద్రే. మోడలింగ్ పై ఆసక్తి ఉండి మొదటి మోడలింగ్ లోకి అడుగు పెట్టిన సోనాలి... ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. మొదట సపోర్టింగ్ హీరోయిన్గా నటించినప్పటికీ ఆ తర్వాత ఈ అమ్మడికి మెయిన్ హీరోయిన్గా కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ లో తన సత్తా చాటుకుని ఎన్నో అవార్డులను సైతం గెలుచుకుంది సోనాలి బింద్రే. టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇంద్ర సినిమాలో అలరించిన సోనాలి బింద్రే.. ఆ తరువాత ఖడ్గం మూవీలో నటించే అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున  తో కలిసి మన్మధుడు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయింది సోనాలి బింద్రే. అంతేకాకుండా బాలకృష్ణతో పలనాటి బ్రహ్మనాయుడు... మెగాస్టార్ తో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాల్లో  నటించింది. సోనాలి  నేడు 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నది. 

 

 

 

 విద్యాబాలన్ : బాలీవుడ్ నటి విద్యాబాలన్ 1979 జనవరి 1న బాంబే లో జన్మించింది. విద్యాబాలన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లికించుకుంది . వైవిద్యాత్మకమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది విద్యాబాలన్. తన అద్భుతమైన నటన కు గాను ఎన్నో అవార్డులు రివార్డులను సైతం అందుకుంది విద్యాబాలన్. తాజాగా తెలుగులో కూడా నటించి తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకుంది విద్యాబాలన్. ఇక హిందీలో కూడా ఎన్నో ప్రయోగాత్మక  సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా నేడు విద్యాబాలన్ తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నది. 

 

 

 

 ఐశ్వర్య ధనుష్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్. సినీ దర్శకురాలిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె గా... తమిళ హీరో ధనుష్ సతీమణిగా ఐశ్వర్య ధనుష్ సినీ ప్రేక్షకులకు కొసమెరుపు. జనవరి 1, 1982లో చెన్నైలో ఐశ్వర్య ధనుష్ జన్మించారు. 2004లో తమిళ హీరో ధనుష్ ను పెళ్లి చేసుకున్నారు రజనీకాంత్ పెద్ద  కుమార్తె ఐశ్వర్య. దర్శకురాలిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకున్నారు ఐశ్వర్య ధనుష్. కాగా నేడు ఐశ్వర్య ధనుష్ తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: