కియారా అద్వాని ..బాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్. అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ అండ్ స్టార్ హీరోతోనే రెండు సినిమాలు చేసేస్తోంది. అందులో ఒకటి రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాం. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన కాంచన కి రీమేక్ గా ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కుతోంది. రీమేక్ కాబట్టి ఈ సినిమా కూడా పక్క గ్యారెంటీ గా బ్లాక్ బస్టర్ అవుతుందని కియారా చాలా కాన్‌ఫిడెంట్ గా ఉందట. అందుకు కారణం  అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్. ఈ సినిమా హిందీ లో 2019 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. షాహిద్ కెరీర్ లోనే ఓ సరికొత్త చరిత్ర సృష్టించిన సినిమాగా రికార్డ్స్ క్రియోట్ చేసింది. దాదాపు 300కోట్ల వసూళ్లు సాధించింది అంటే ఎంతో గొప్ప అని చెప్పాలి. ఇక ఈ సిన్మాలో కియరా అద్వాని  హీరోయిన్ గా నటించింది. 

 

ఇంటెన్స్ పాత్రలో నటించిన కియరా పై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. అయితే నిజ జీవితం లో కియరా అలా ఉంటుందా? అంటే తన నుండి ఎవరు ఊహించని ఆసక్తికరమైన ఆన్సర్ వచ్చింది. నిజజీవితంలో నేను పూర్తిగా వేరు. ప్రీతిలా కొన్ని మాత్రమే చేయగలను. మిగతా వాటికి అస్సలు ఛాన్సే లేదు. అవేంటో మీకిప్పటికే అర్థమై ఉంటుందని తెలిపింది. బాలీవుడ్ లో 2019 కియారా అద్వానీ కెరీర్ కి బాగా కలిసొచ్చిన ఏడాదిగా నిలిచింది. ప్రీతిగా కియారా నటనకు గుర్తింపు వచ్చింది. అయితే ..అణచి వేతకు గురైన ప్రేమికురాలి పాత్ర అది అంటూ.. హాని కలిగించే ప్రియుడు కబీర్ సింగ్ అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కబీర్ లాంటి పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్థించడం సరైనదేనా? అంటూ చర్చ సాగింది. అలాంటి పాత్రను అంగీకరించడమెలా? ప్రీతిగా కియరా ప్రవర్తించిన తీరు సరైనదేనా? అని ప్రశ్నిస్తే...ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి.

 

ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు చెప్పొచ్చు. వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకమైన చిత్రమిది. ఈ పాత్ర నా స్వభావానికి భిన్నమైనది. సరైనదా కాదా అనే చర్చలో పాల్గొనలేను. అది తప్పు ఒప్పు అనేది నాకు కూడా తెలియదు. నేను ఏం చేసినా చేసే పనిలో జీవించేందుకే ఇష్టపడతాను. ప్రతి ఒక్కరూ వారేం అనుకుంటే అదే చెప్పారు. ఈ చిత్రానికి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అంతేకాదు లస్ట్ స్టోరీస్ లో నటించడం కూడా నాకు తెలీకుండా జరిగిపోయింది. ఆ పాత్ర చేయడం తప్పు అని నేను అనుకోలేదు..డైరెక్టర్ ఇలా చేయి అన్నారూ చేసుకుంటూ వెళ్ళాను అంతే. ఇంతగా పాపులర్ అవుతుందని అసలు ఊహించలేదని కియారా తెలిపింది.

 

ఇక ప్రీతి ప్రేమలో చేసిన అదే పనిని కియరా నిజ జీవితంలో చేస్తుందా అంటే మాత్రం. 'వ్యక్తి గతంగా.. నేను చాలా భిన్నమైన వ్యక్తిని. నేను అలాంటి పరిసరాల్లో ఎదగని కారణంగా నేను తనలాగే స్పందించకపోవచ్చు. నా మనస్తత్వం వేరు.. నేను పెరిగిన పరిసరాలు, మనుషులు వేరు. అసలు కియారా పూర్తిగా వేరు. ప్రీతితో పోలిక అన్నదే ఉండదు. ప్రీతి చేసిన చాలా పనులు నేను చేయలేను' అని కియరా నిర్మొహమాటంగా చెప్పింది. ఈ సినిమాలో ప్రతిదీ కల్పితమైనవి. ప్రీతి లేదా కబీర్ లాగా ఉండమని ఎవరూ మిమ్మల్ని అడగడం లేదు. అవి రెండూ చాలా లోపం ఉన్న క్యారెక్టర్లు అని కియరా తన అభిప్రాయాన్ని నిస్సందేహంగా బయటకు చెప్పింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: