ఆర్.ఎక్స్.100 సినిమాతో టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ ఫేమస్ అయింది పాయల్ రాజ్ పుత్. అసలు ఏమాత్రం ఆలోచించకుండా కార్తికేయతో లిప్ లాక్స్ కి హాట్ రొమాన్స్ కి సై అని రెచ్చిపోయింది. జనాలు కూడా అంతే ఇదిగా పాయల్ ని ఎంకరేజ్ చేశారు. అందుకే వెంటనే ఐటం సాంగ్ లో ఆ తర్వాత ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమాలో ఇంకా హాట్ హాట్ గా నటించింది. కానీ ఎందుకనో ఈ సినిమా పాయల్ కి అసలు ఉపయోగపడలేదు. పైగా నెగిటివ్ కామెంట్స్ పడ్డాయి. దాంతో ఇక ఇలాంటి సినిమాలు చేయనని డిసైడయింది. ఇదిలా ఉంటే సాధారణంగా ఫేవరెట్ హీరో విషయంలో అభిమానులు క్లియర్ కట్ గా ఉంటారు. తమకు ఫలనా హీరో అంటే ఇష్టం అని పబ్లిక్ గా చెబుతుంటారు. హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో పెద్దగా బయటపడరు. ఎందుకంటే అవకాశాలు పోతాయని భయం. ఏ హీరోను పొగిడితే ఏ హీరో హర్ట్ అవుతాడో తెలియని భయం ప్రతీ హీరోయిన్ కి ఉంటుంది. 

 

అందుకే అందరూ ఇష్టమే, అందరితో సినిమాలు చేయాలని ఉందంటూ గోడమీద పిల్లిలా కలరింగ్ ఇస్తుంటారు. కానీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రయిట్ గా సమాధానమిచ్చి అందరికి షాకిచ్చింది. సిల్వర్ స్క్రీన్ మీద బోల్డ్ గా కనిపించే ఈ హాట బ్యూటి.. తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పడంలో కూడా అంతే బోల్డ్ గా రియాక్ట్ అయింది. విజయ్ దేవరకొండ కంటే తనకు ప్రభాస్ అంటేనే ఎక్కువ ఇష్టమని ప్రకటించింది. అక్కడితో ఆగకుండా.. ఒకేసారి ఇటు దేవరకొండ, అటు ప్రభాస్ సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తే.. ఎవర్ని సెలక్ట్ చేసుకుంటారంటే ఠక్కున.. ప్రభాస్ అని సమాధానం చెప్పేసింది.

 

నిజానికి కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకుంటానని, ఇద్దరితో నటిస్తానని చెబితే సరిపోయేది. కానీ పాయల్ మాత్రం ప్రభాస్ కోసం వెయిటింగ్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ నుంచి ఆఫర్ వస్తే, పక్కన ఎంత పెద్ద సినిమా ఉన్నా వదిలేస్తానని ప్రకటించింది. అంతే కాదు తనకోసం ఏదైనా చేసేయొచ్చని చెప్పింది. ఈ ఒక్క విషయంలో విజయ్ దేవరకొండను కూడా పక్కన పెట్టేస్తానంటోంది. పాయల్ కి బహుషా ప్రభాస్ హైట్ బాగా నచ్చిందేమో అందుకే ఇలా బోల్డ్ గా మాట్లాడేసింది. ఇక రీసెంట్ గా వెంకీమామ సినిమా చేసింది పాయల్. కానీ అది ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. అంతకంటే ముందు ఆమె చేసిన ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమా ఆమె కెరీర్ ను బాగా దెబ్బతీసింది. ప్రస్తుతం పాయల్ చేతిలో రవితేజ హీరోగా డిస్కోరాజా సినిమా మాత్రమే ఉంది. మరి ప్రభాస్ పాయల్ కి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: