మన టాలీవుడ్‌లో అందం, అభినయం తో పాటు ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల హీరోయిన్స్ లో రెజీనా ముఖ్యంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హాట్, గ్లామర్, రొమాంటిక్, సెంటిమెంట్ ఇలా ఎలాంటి పాత్రలో అయినా నటించమంటే జీవించేయడంలో ఈ గ్లామర్ బ్యూటి ముందు వరుసలో ఉంటుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో వరుసగా సినిమాలు చేసిన రెజీనా తర్వాత కొన్నిరోజుల పాటు అడ్రస్ లేకుండా పోయింది. అయితే మళ్లీ లైం లైట్ లోకి ఈ అమ్మడికి 'ఎవరు' సినిమాతో తనెవరో తన రేంజేంటో టాలీవుడ్ ప్రేక్షకులు తెలియజేసింది. ఇక మొదటి నుంచి రెజీనా గురించి పుకార్లు షికార్లు చేయడం కొత్త కాదు. సినిమాల విషయాలు మొదలుకుని లవ్, డేటింగ్, అఫైర్స్, నిశ్చితార్థం, పెళ్లి ఇలా చాలా వ్యక్తిగతమైన విషయాల్లో రెజీనా సెన్ సెషన్ అయింది. అయితే వీటిలో కొన్నింటిపై స్పందించి రెజీనా క్లారిటీ కూడా ఇచ్చుకుంది.

 

అయితే మళ్లీ పాత రోజులొచ్చాయని.. సినిమాలతో బిజిబిజీగా ఉన్న రెజీనాపై మరోసారి కొన్ని పుకార్లు మొదలయ్యాయి. త్వరలో తమిళంలో ఓ సినిమాలో నటించనున్నది అనే వార్త ఒక్కటి కాగా.. మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోందని.. అది కూడా ఐటెం సాంగ్‌లో నర్తించడానికి ఈ బ్యూటి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా రెజీనాకు సంబంధించిన ఈ రెండు పుకార్లు అటు టాలీవుడ్‌లో ఇటు కోలీవుడ్‌లో జోరుగ షికార్లు చేస్తున్నాయి.

 

ఇక తమిళ సినిమాలో జోష్యం చెప్పే పాత్రలో రెజీనా నటించడానికి కమిటయిందని తాజాగా వినిపిస్తోంది. ఒకవేళ సినిమా సూపర్ హిట్టయితే ఆ పాత్రకు మంచి పేరు వస్తుందని.. ఇక మనకు తిరుగే ఉండదని రెజీనా భావిస్తోందట. అంతేకాదు.. ఈ ఒక్కటి సూపర్ డూపర్ హిట్టయితే తమిళ సినిమాలలో మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయని రెజీనా ఆతృతగా ఎదురు చూస్తోందట. ఇదే ఒక హాట్ న్యూస్ అనుకుంటే.. చిరు-కొరటాల కాంబోలో వస్తున్న సినిమాలో మెగాస్టార్‌తో కలిసి రెజీనా స్టెప్పులేయనుందనేది ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చిరు సరసన రొమాంటిక్ సాంగ్‌కు ముందుగా చాలా మంది క్రేజీ హీరోయిన్లను అనుకున్నా.. రెజీనానే ఫైనల్ చేశారట. ఇప్పటికే రెజీనాపై బోలెడన్నీ రూమర్స్‌ రాగా.. తాజాగా మళ్లీ రూమర్స్‌.. ఇలా ఇంకా ఎన్నెన్ని రూమర్స్ వస్తాయో ఏంటో మరి. అయితే రెజీనా మాత్రం మెగాస్టార్ రూమర్ విషయంలో హ్యాపీగా ఉన్నా మిగత వాటి విషయంలో మాత్రం బాగా హర్ట్ అవుతుందట. నా వల్ల కదు ఇలాంటి రూమర్స్. ప్రతీది నాకే అంటగడుతున్నారు అంటూ తన వాళ్ళ దగ్గర వాపోతుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: