ఒకప్పుడు సినిమాకి టికెట్ తీసుకోవాలంటే ఓ ప్రహసనం. ముఖ్యంగా కొత్త సినిమా ఓపెనింగ్ షో టికెట్ దక్కించుకుంటే లాటరీ కొట్టినట్టే. ముందుస్తు బుకింగ్స్. నైట్ షో టికెట్, బెనిఫిట్ షో టికెట్, అడ్వాన్స్ బుకింగ్, భారీ లైన్లు, మనిషికో టికెట్.. ఇలా సినిమాకు చూడాలంటే చాలా దాటాల్సి వచ్చేది. అప్పట్లో సినిమానే వినోదం కాబట్టి ప్రేక్షకులు కూడా ఇది ఇబ్బందిలా ఫీల్ అయ్యేవారు కాదు. కానీ.. టెక్నాలజీ వచ్చేశాక అనేక మార్పులు వచ్చేశాయి.

 

 

ఒకప్పుడు ఫ్యాన్స్ కు చొక్కాలు చిరిగితే కానీ సినిమా టికెట్ దొరికేది కాదు. ఫ్యామిలీస్ కు లైన్లో నుంచుంటే కానీ టికెట్ దొరికేది కాదు. కాని ఇప్పుడు టికెట్ బుకింగ్ సైట్స్ వచ్చేశాయి. చక్కగా ఇంట్లోనే కూర్చుని టికెట్ బుక్ చేసుకుని టైమ్ కి వెళ్లి సినిమా చూసి వచ్చేయడమే. కేవలం అరచేతిలోని ఫోన్లో సినిమా టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయం వచ్చేసింది. అలా బుక్ చేసుకునే పోర్టల్స్ లో బుక మై షో ఒకటి. ప్రతి ఏటా ఈ సైట్ ద్వారా ఏ సినిమాకు ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయాయో ఓ లెక్క తీస్తూంటుంది. అలా ఈ ఏడాది సదరు సైట్ తేల్చిన లెక్కల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజీయస్ మూవీ సైరా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సైట్లో సైరాకు ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయాయని ఓ అధికారిక లెక్క ఇచ్చింది.

 

 

తర్వాతి స్థానాల్లో ప్రభాస్ సాహో, మహేశ్ మహర్షి, వెంకటేశ్ ఎఫ్2, నాగచైతన్య – సమంతల మజిలీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సైరా తెలుగులో నాన్ బాహుబలి రికార్డ్స్ సృష్టించింది. రంగస్థలం పేరు మీద ఉన్న కలెక్షన్లను చెరిపేసింది. మిగిలిన నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్, సూపర్ హిట్స్ గా ఈ ఏడాది నిలిచినవే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: