ఏ సినిమాకైనా టైటిల్ చాలా కీలకం. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేది టైటిల్. సినిమాకు పెట్టిన టైటిల్ తోనే ప్రేక్షకుల్లో సగం బజ్ క్రియేట్ అవుతుంది. సినిమాపై ఓ అంచనాకు వచ్చేది.. అంచనాలు పెంచేది టైటిలే. ఇందులో కాదనేది లేదు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ను పరిశీలిస్తే చాలా మాసివ్ గా, క్యాచీగా ఉంటాయి. అలాంటి టైటిల్స్ తోనే ఆయన మాస్ హీరోగా మెగాస్టార్ గా ఎదిగారనడంలో సందేహం లేదు. కధానుసారం ఆయా టైటిల్స్ ఆయనకు మాత్రమే ప్రత్యేకమా అన్నట్టు ఉండేవి.

 

 

ఈ జనరేషన్ లో ఆయా హీరోలు చిరంజీవి సినిమా టైటిల్స్ ను పెట్టుకోవడం ఆనవాయితీగా తీసుకున్నట్టున్నారు. నానీ అయితే ఏకంగా చిరంజీవి కల్ట్ మాస్ మూవీ గ్యాంగ్ లీడర్ నే పెట్టుకున్నాడు. దీనిపై మెగాఫ్యాన్స్ ఫైర్ అయినా చిరంజీవి అడ్డు చెప్పకపోవడంతో వివాదం జరగలేదు. ఇక రీసెంట్ తమిళ నటులు చిరంజీవి టైటిల్స్ పై కన్నేశారు. కార్తీ అయితే ఏకంగా రెండు టైటిల్స్ ను వాడేశాడు. చిరంజీవి కెరీర్ ల్యాండ్ మార్క్ ఖైదీని తీసుకుని వెంటనే మరో సినిమాకు దొంగ టైటిల్ ను పెట్టుకున్నాడు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ మాస్టర్ మూవీ టైటిల్ ను తీసేసుకున్నాడు. ఇలా తమిళోళ్లు చిరంజీవి టైటిల్స్ పై కన్నేయడం మెగా అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా రుచించని విషయమే.

 

 

పాత సినిమా టైటిల్స్ తీసుకోవడం కొత్తేమీ కాదు. కానీ.. కేవలం చిరంజీవి టైటిల్స్ ను మాత్రమే తీసుకుంటున్నారా.. వాటిపైనే కన్నేశారా అనే అనుమానాలు రాకపోదు. అదీ.. ఇతర భాషల హీరోలు. ఇది మెగా అభిమానులను బాధించేదే. చిరంజీవి వారసులుగా వచ్చిన ఏ హీరో కూడా చిరంజీవి సినిమా టైటిల్స్ ను పెట్టుకోకపోవడం ఇక్కడ గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: