బాడీగార్డ్ అనగానే బాడీగార్డ్ సినిమాలో వెంకటేష్ గుర్తుకు వస్తాడు. కాని అక్కడ వెంకటేష్ నయా పైసా తీసుకోకుండా బాడీగార్డ్‌గా ఉంటాడు. ఎందుకంటే అది సినిమా. ఇక నిజ జీవితానికి వస్తే రాజకీయనాయకుల బాడీగార్డ్ జీతాలు మా అంటే ఇరవై వేయిలు, ఇంకా పోతే ఓ ముప్పైనో లేక యాబై వేయిలో ఉంటాయి కాని చచ్చినా అంతకంటే ఎక్కువ జీతాలు లేపలేరు. కాదు కాదు ఇవ్వరు కూడా. కాని కోట్లల్లో జీతాలు తీసుకునే బాడీగార్డులు కూడా ఉన్నారండోయ్..

 

 

అవును ఆశ్చర్య పోకండి నిజమే.. ఒక బాడీగార్డ్‌కు అన్నేసి జీతాలా అయితే మేము చేస్తాం ఆ ఉద్యోగమంటే కుదరదు. ఎందుకంటే ఈ బాడీగార్డ్స్ చేస్తున్న ఉద్యోగం బాలీవుడ్ సెలబ్రేటీల దగ్గర. ఇకపోతే అత్యధికంగా జీతాలు ఇస్తున్న బాలీవుడ్ హీరోలు, అంతే జీతాన్ని పుచ్చుకుంటున్న బాడీగార్డులు ఎవరెవరో వారి పేర్లు ఏంటో తెలుసుకుందాం.. మొట్టమొదటిగా హీరోయిన్లలో అత్యధికంగా సాలరీ ఇచ్చే వారిలో దీపికా పదుకొనే ఫస్ట్ ఉంది. ఆమె తన వ్యక్తిగత బాడీ గార్డుకు సంవత్సరానికి 80లక్షల రూపాయలను జీతంగా ఇస్తుంది. ఆ బాడీగార్డు పేరు జలాల్... ఇక హీరోలల్లో చూసుకుంటే బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబచ్చన్… సంవత్సరానికి కోటీ యాబై లక్షల రూపాయలను జీతంగా ఇస్తున్నారు. అతని పేరు జితేంద్ర షిండే..

 

 

మరో హీరో అక్షయ్ కుమార్.. ఈయనకు బాడీ గార్డ్ గా శ్రేయాస్ తేలే పనిచేస్తున్నారు. కాగా ఇతని జీతం ఒక కోటీ ఇరవై లక్షల రూపాయలు.. ఇక ఆమిర్ ఖాన్… ఈయన బాడీగార్డ్ యువ్ రాజ్ గోర్పాడే.. యువ్ రాజ్ కు సంవత్సర జీతం రెండు కోట్ల రూపాయలు. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఇతని బాడీగార్డ్ పేరు షేరా… ఈయన సంవత్సర జీతం రెండు కోట్లు.. ఇకపోతే బాడీగార్డ్స్‌లలో ప్రస్తుతం అత్యధికంగా జీతం అందుకుంటున్న బాడీగార్డ్ ఎవరంటే రవి అని చెబుతున్నారు. ఇతను షారూక్ ఖాన్… బాడీ గార్డ్ ఇతని జీతం సంవత్సరానికి 2.50 కోట్ల రూపాయలు.. ఇకపోతే సెలబ్రిటీల బాడీగార్డులకు ఇచ్చే జీతంలో అత్యధికంగా రవికే దక్కుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: