హలో ప్రజలారా! మొదటిగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే, నటి సోనమ్ కపూర్ 2010-20 వరకు తనకి జరిగిన సంఘటలను గుర్తుచేసుకొని సాధ్యమైనంత మంచిగా గత దశాబ్దానికి వీడ్కోలు చెప్పాలనుకుంది. 34 ఏళ్ల భామ సోనమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఒక వీడియోను షేర్ చేసింది, ఇందులో ఆమె తన భర్త ఆనంద్ అహుజాను ముద్దుపెట్టుకోవడం చూడవచ్చు.



నటి తన వీడియోతో పాటు విస్తృతమైన పోస్ట్‌తో వచ్చింది. ఆమె గత దశాబ్ధాన్ని ఒక్క వర్డ్ లో "బ్రిలియంట్" అని సంక్షిప్తీకరించింది. గత దశాబ్దంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆమెకు అంతా మంచే జరిగిందని సోనమ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సోనమ్ పోస్ట్ నుండి ఒక సారాంశం ఇలా ఉంది, "నేను నా భర్త ఆనంద్ అహుజాను కలుసుకున్నాను. అతనిని మ్యారేజ్ చేసుకున్నాను, ఇంకా మేము కలిసి ఒక ఇంటిని కూడా కట్టుకున్నాము. నా కుటుంబానికి, స్నేహితులకు ధన్యవాదాలు, సినిమాలు, ఫ్యాషన్‌కి ధన్యవాదాలు. మీరు నన్ను సంపూర్ణంగా చేస్తారు.' అని రాసింది.


తన సోదరి రియా కపూర్‌తో కలిసి తన సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించి, ఆమెతో కలిసి ఈషా, వీరే డి వెడ్డింగ్ వంటి చిత్రాల్లో కలిసి పనిచేసిన సోనమ్, "ఈ గత దశాబ్దం నాకు చాలా సానుకూలంగా ఉంది. నేను కొన్ని అద్భుతమైన సినిమాల్లో నటించాను. జీవితకాల మిత్రులుగా మారిన కొంతమంది అద్భుతమైన వ్యక్తులను నేను కలుసుకున్నాను. నేను రియా కపూర్‌తో కలిసి మూడు సినిమాలు చేశాను, ఫ్యాషన్ పట్ల నాకున్న అభిరుచితో Rheson ప్రారంభించాను.' అని చెప్పుకొచ్చింది.


సోనమ్ కపూర్ తన చిరకాల ప్రియుడు ఆనంద్ అహుజాను మే 2018 లో వివాహం చేసుకుంది. ఈ జంట తరువాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించింది, దీనికి బాలీవుడ్ ఎ-లిస్టర్స్ హాజరయ్యారు.



ప్రొఫెషనల్ రంగంలో, సోనమ్.. షెల్లీ చోప్రా ధార్స్ ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగా సినిమాలో అనిల్ కపూర్, రాజ్కుమ్మర్ రావు, జూహి చావ్లా లతో కలిసి నటించింది. ఆమె ది జోయా ఫాక్టర్‌లో, దుల్కర్ సల్మాన్, అంగద్ బేడితో కలిసి నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: