బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఈ ఏడాది ఇప్పటికే భారత్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బాలీవుడ్ లో సల్మాన్ సినిమా వస్తుందంటే చాలు మంచి పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అలానే ఇటీవల ఆయన నటిస్తున్న సినిమాలన్నిటికీ కూడా మంచి సక్సెస్ టాక్ లభించడంతో పాటు కలెక్షన్ కూడా అద్భుతంగా వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా సల్మాన్ నటించిన తాజా సినిమా దబాంగ్ 3 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

ఎన్నో అంచనాల మధ్య మొన్న 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇక తెలుగులో మొదటి రోజు మొదటి షో అనంతరం చతికిల పడిన ఈ సినిమా, ప్రస్తుతం అటు హిందీలో కూడా భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్. నిజానికి సల్మాన్ సినిమాకు పర్వాలేదనిపించే టాక్ వస్తే చాలు మినిమమ్ గా రూ.200 కోట్లవరకు కలెక్షన్ వస్తుందని, ఆ విధంగా చూసుకుంటే తొలి రోజు యావరేజ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు బాగానే కలెక్షన్ వస్తుందని భావించామని, అయితే ఇప్పటివరకు ఓవర్ ఆల్ గా ఈ సినిమా రూ.137 కోట్లకు మించి కలెక్ట్ చేయలేకపోవడం నిజంగా ఎంతో ఆశ్చర్యకరం అని వారు అంటున్నారు. 

 

ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ కుమార్ నటించిన తాజా సినిమా గుడ్ న్యూజ్, సూపర్ హిట్ టాక్ తో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ ని కొల్లగొట్టి విజయవంతంగా దూసుకుపోతోందని, ఈ సినిమా హిట్ తో దబాంగ్ పరిస్థితి మరింత దారుణంగా తయారయిందని చెప్తున్నారు. నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయితే సినిమా ప్రస్తుతం ఇంత దారుణంగా ముందుకు సాగడం సల్మాన్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ని కూడా ఎంతో షాక్ కు గురి చేసిట్లు సమాచారం. ఏది ఏమైనా ఇది నిజంగా సల్మాన్ కు చావు దెబ్బె అని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: