టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మొదటగా కొన్నేళ్ల క్రితం విజయవాడ నుండి సినిమాల పై ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీకి ప్రవేశించాడు. అయితే అప్పట్లో కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పని చేసిన వర్మ, ఆ తరువాత మెల్లగా తన టాలెంట్ తో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత పలు విజయవంతమైన సినిమాలు తీసిన వర్మ, అప్పట్లో కొన్ని సంచలన విజయాలు కూడా అందుకున్నారు. తెలుగులో వెంకటేష్, నాగార్జునలతో సూపర్ హిట్స్ తీసి, ఆ తరువాత బొంబాయి చేరి, అక్కడి బాలీవుడ్ దిగ్గజ నటులను కూడా దర్శకత్వం వహించి దేశవ్యాప్తంగా మంచి పేరు గడించాడు. కానీ ఇటీవల కొన్నేళ్లుగా మాత్రం వర్మ తీస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. 

 

మొదటి నుండి ఏ విషయాన్ని అయినా మొహం మీదే కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడే అలవాటున్న వర్మ, కొన్నాళ్లుగా పలు వివాదాస్పద అంశాలతో సినిమాలు తీస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రక్త చరిత్ర, వంగవీటి, బెజవాడ, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వంటి వివాదాస్పద సినిమాలు తీసిన వర్మ, ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కొత్త సినిమా బ్యూటిఫుల్. నైనా గంగూలీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వోడ్కా పార్టీలో హీరోయిన్ నైనాతో కలిసి వర్మ వోడ్క తాగుతూ పార్టీకి వచ్చిన వారందరి ముందు డాన్స్ చేయడం పై కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

ఇప్పటికే వర్మ చర్యలతో కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆయన సినిమా చూడడమే మానేశారని, ఇక ప్రస్తుతం ఈ విధంగా పబ్లిగ్గా మందేస్తూ, పైగా అమ్మాయితో చిందేస్తున్న వర్మను చూస్తుంటే ఈయన దర్శకుడా లేక రసికుడా అంటూ పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. సంఘంలో మంచి పేరున్న దర్శకుడై ఉండి, యువతను ఈ విధంగా తప్పుడు అలవాట్లను ప్రేరేపిస్తున్న వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వారు కూడా వున్నారు. కాగా నేడు హీరోయిన్ నైనాతో కలిసి వర్మ మందేసి చిందేస్తున్న వీడియో పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: