కాలం అస్థిరమైంది ప్రతి క్షణం మారిపోతు ఉంటుంది. ప్రతి వ్యక్తి ఉదయాన్నే చేయవలసిన పనులను సంకల్పాన్ని డైరీలో వ్రాసుకుని కాలంతో పరుగేడదామాని వారివారి స్థాయిలలో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అయితే కాలం ఎంతటి గొప్ప వ్యక్తిని అయినా ఎదో ఒకచోట ఓడిస్తూనే ఉంటుంది. ఎన్ని ఓటములు ఎదురైనా ప్రతి వ్యక్తికి కొత్త సంవత్సరాన్ని తలుచుకుంటే ఉత్సాహం పుట్టుకు వస్తుంది. 
ఈ శతాబ్దానికి సంబంధించి కొత్త దశాబ్దానికి ప్రారంభంగా నేడు ప్రారంభం అవుతున్న 2020 ఒక మైలురాయి లాంటి సంవత్సరం. మార్పు జెండా పట్టుకుని కాలం అనే గుర్రం మీద దూసుకు వస్తున్న యోధుడు లా ఈరోజు మన జీవితాలలోకి వస్తున్న ఈ కొత్త దశాబ్దంలో ప్రపంచంలో అనేక మార్పులు జరగబోతున్నాయి. 

వాస్తవానికి 20 అనేది ఒక కీలకమైన సంఖ్య దీనితో సంఖ్యా శాస్త్రంలో కూడ 20కి అపరమితమైన ప్రాముఖ్యత ఉంది. ఉదయాస్తమయాలు ప్రకృతి సిద్ధంగా ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రతి ఏడాది పాత సంవత్సరం గతించిపోయి కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది. అయితే ఈ 2020 – 2030 ల మధ్య ఒక ప్రధాన సమస్య యావత్తు ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తోంది. 

ప్రస్థుతం ఆరోగ్య ప్రమాణాలు పెరిగి పోవడంతో ప్రపంచ వ్యాప్తంగా వృద్ధ జనాభా విపరీతంగా పెరిగి పోతోంది. అదేవిధంగా 15 సంవత్సరాల వయసులోపల పిల్లల సంఖ్య కూడ విపరీతంగా పెరిగి పోతున్న నేపధ్యంలో ప్రస్తుతం భారతదేశ జనాభాలో సగానికి పైగా వృద్ధులు పిల్లలు ఉండటంతో ఉత్పాదక రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలిగిన జనాభా సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం అంత ఆరోగ్యకరమైన పరిణామం కాదని సామాజిక శాత్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. 

ఇక యువతరాన్ని తీసుకుంటే వారి సమర్ధతకు అవకాశాలు లేక వారి నైపుణ్యాలను పెంచుకునే విద్య వ్యవస్థ లేక భారతదేశంలో ఉన్న యువత అగమ్యగోచరంలో అయోమంగా ఉంది. దీనికితోడు 16 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలలోపు  ఉండే యువతీయువకులు అంతా రోజుకు నాలుగు గంటలు పైన వారిచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్స్ తో కాలం గడుపుతూ తమ విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారు అంటూ మరొక అధ్యయనం తెలియ చేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో సూపర్ రిచ్ వర్గం జనాభా పెరిగి పోతుంటే ఇప్పటికీ దేశంలో 36 శాతం ముంది తినడానికి సరైన పౌష్టిక ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నారు అన్నది వాస్తవం. ఇలా ప్రపంచంలో మాత్రమే కాదు. మన దేశంలో కూడ ఎన్నో సమస్యలు. అయినా ఈనాటి ఉషోదయం ఈనాటి సాయంకాల సంధ్యాసమయం అని తెలిసినా నూతన సంవత్సరం వస్తోంది అని తెలియగానే ప్రతి వ్యక్తి మనసు కొత్త ఆశలతో చిగురిస్తూనే ఉంటుంది. ఏది ఎలా ఉన్నా ఈ నూతన సంవత్సరం అందరి ఆశలు తీరాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: